Advertisement
Google Ads BL

నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం 'శ్రీమంతుడు'-మహేష్!


సూపర్‌స్టార్‌ మహేష్‌, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం శ్రీమంతుడు. మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ పై ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్ 7న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..

Advertisement
CJ Advs

మహేష్ బాబు మాట్లాడుతూ "ఆగస్ట్ 7 నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం 'శ్రీమంతుడు'. అందరూ బాగా నటించావని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇంత మంచి సినిమాను నాతో చేసిన కొరటాల శివ గారికి థాంక్స్ అని చెప్తే అది చాలా చిన్న మాట అవుతుంది. కమర్షియల్ యాంగల్, మాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో ఓ ప్యాకేజ్డ్ లా ఉన్నాయి. అందుకే స్క్రిప్ట్ విన్న వెంటనే ఓకే చెప్పేసాను. సినిమాటోగ్రాఫర్ మది నా కెరీర్ లో బెస్ట్ లుక్ ఇచ్చారు. ఇక దేవిశ్రీ అయితే సినిమా మొదలుపెట్టకముందే సూపర్ హిట్ మ్యూజిక్ ఇస్తానని చెప్పారు. అన్నట్లుగానే చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చూసిన తరువాత చాలా మంది యువత ఇన్స్పైర్ అవుతున్నారు. అంత పవర్ ఫుల్ కథ ఇది. ఈరోజు ఏదైతే అప్రిసియేషన్ వస్తుందో అది మేము అసలు ఊహించలేదు. ఏ సినిమాకు నేను హొమ్ వర్క్ చేయను. ఈ సినిమాకు కూడా హొమ్ వర్క్ అంటూ ఏం చేయలేదు. కాకపోతే దర్శకునితో ఎక్కువ సమయం ఇంటరాక్ట్ అవుతాను. ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో బాగా ప్రమోట్ చేసాం. మన తెలుగు ఆడియన్స్ కు సినిమాల పట్ల ఉండే అభిమానం మరెవరికి ఉండదు. ఓ మంచి సినిమా తీస్తే చాలు ఖచ్చితంగా పెద్ద హిట్ చేస్తారు. ఇది హానెస్ట్ స్క్రిప్ట్ కనుకే ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసారు. ఈ సినిమా చూసి నాన్నగారు కొరటాల శివ గారితో మహేష్ కెరీర్ లో బెస్ట్ ఫిలిం అని చెప్పారు. నా దగ్గరకి వచ్చి చాలా బాగా నటించావని చెప్పారు" అని చెప్పారు.

కొరటాల శివ మాట్లాడుతూ "పాజిటివ్ మైండ్ తో వర్క్ చేస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుందనడానికి ఉదాహరణ 'శ్రీమంతుడు' సినిమా. ఈ చిత్రానికి ఇంత మంచి అప్రిసియేషన్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. స్క్రిప్ట్ లో హర్ష క్యారెక్టర్ ను చాలా నమ్మాను. మిలియనీర్ అయిన అబ్బాయి సింపుల్ గా సైకిల్ మీద తిరగడం చాలా రియలిస్టిక్ గా అనిపించింది. ఆ పాయింట్ ప్రేక్షకులకు బాగా రీచ్ అయింది. సినిమా అనుకున్న దాని కంటే పెద్ద సక్సెస్ అయింది. ఈ విజయంలో అందరూ నటీనటులు, టెక్నిషియన్స్ పార్ట్ గా ఉన్నందుకు అందరికీ థాంక్స్. ఇటువంటి సినిమాని చేయడానికి అంగీకరించిన మహేష్ బాబుగారికి స్పెషల్ థాంక్స్. ఈ విజయంతో ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా మరిచిపోయాను" అని చెప్పారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ "తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరో అనేవాడు పాజిటివ్ గా ఉండేవాడు. ఆ ఇంపాక్ట్ ప్రజల మీద బాగా ఉండేది. ఆ తరువాత నరుక్కోవడం, చంపుకోవడం అనే కాన్సెప్ట్స్ తోనే సినిమాలు వచ్చాయి. చాలా రోజుల తరువాత హీరోయిజం అనేదానికి కొత్త ట్రెండ్ సృష్టించింది 'శ్రీమంతుడు' చిత్రం. మహేష్ లాంటి ఓ అధ్బుతమైన నటుడ్ని సినిమాలో చూసాం. ఈ క్రెడిట్ అంతా శివ గారికే దక్కుతుంది" అని చెప్పారు.

జగపతి బాబు మాట్లాడుతూ "ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్. ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పారు.

నిర్మాత నవీన్ మాట్లాడుతూ "2014 ఏప్రిల్ 18న మహేష్ గారితో సినిమా చేస్తున్నామని తెలిసి చాలా సంతోషపడ్డాం. సినిమా సక్సెస్ తో వచ్చిన హ్యాపీనెస్ ఎప్పుడు రాలేదు. తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో వై.రవిశంకర్, సి.వి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs