>'బాహుబలి' తో సంచలనాలు క్రియేట్ అయ్యాయి. భారతీయ చిత్ర పరిశ్రమ సత్తాని మరోసారి సగర్వంగా ప్రపంచానికి చెప్పిందీ చిత్రం. ఓ రీజనల్ ఇండస్ట్రీలో రూపుదిద్దుకొన్న 'బాహుబలి'> జాతీయస్థాయిలో రూపుదిద్దుకొనే హిందీ సినిమాలకి ధీటుగా వసూళ్లు సాధించింది. తెలుగులో తెరకెకక్కిన 'బాహుబలి' >గురించి తొలిసారి దేశం మొత్తం మాట్లాడుకొంది. విడుదలై పాతిక రోజులు పూర్తయినా ఇప్పటికీ బాక్సాఫీసు దగ్గర పైసా వసూల్ కార్యక్రమంలో బిజీగా ఉంది 'బాహుబలి'>. దీనికి కొనసాగింపుగా రాబోతున్న 'బాహుబలి 2' >గురించి వ్యాపార వర్గాలు కన్నేశాయి. ఆమధ్య ` ఓ కార్పొరేట్ సంస్థ టక్కున కొనే ప్రయత్నాలు చేస్తోందన్న వార్త బయటికొచ్చింది. చిత్రీకరణకి ముందే రూ. 500కోట్లకు సినిమా అమ్ముడైందని అన్నారు. ఆ తర్వాత ఆ వార్తలో నిజం లేదని తేలింది.
>ఇప్పుడు మాత్రం 'బాహుబలి 2' >` వ్యాపారం మొదలైపోయింది. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కర్ణాటకకి సంబంధించిన డిస్ట్రిబ్యూట్ హక్కుల్ని భారీ ధరకు కొనుగోలు చేశాడు. 'ఈగ' , 'అందాల రాక్షసి', 'లెజెండ్', 'ఉహలు గుసగుసలాడే', 'దిక్కులు చూడకు రామయ్యా', ‘తుంగభద్ర’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి. నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించారు. 'బాహుబలి ది బిగినింగ్`ని కూడా ఆయన కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేశారు. తాజాగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన బాహుబలి పార్ట్ 2 హక్కులను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయనంత ఫ్యాన్సీ రేటును చెల్లించి సాయికొర్రపాటి కైవసం చేసుకున్నారట. బాహుబలి 2 చిత్రీకరణ త్వరలోనే మొదలుకాబోతోంది. సినిమా సెట్స్‌పైకి వెళ్లేలోపు మరిన్ని ఏరియాలకి సంబంధించిన బిజినెస్ వార్తలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
Advertisement
CJ Advs