అల్లు అరవింద్ గారు సమర్పణలో, GA2 (A Division of GeethaArts) బాన్యర్ పై , మిర్చి, రన్‌రాజారన్, జిల్ లాంటి హ్యట్రిక్ సూపర్‌డూపర్ హిట్స్ ని సొంతం చేసుకున్న క్రేజి ప్రోడక్షన్ హౌస్ UV Creations సంయుక్తంగా ప్రోడక్షన్ నెం-1 గా రూపోందిస్తున్న ఫ్యామిలి అండ్ లవ్ ఎంటర్‌టైనర్ "భలే భలే మగాడివోయ్". నాని, లావణ్య త్రిపాఠి లు జంటగా నటిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నివాసు నిర్మాత. ఈ చిత్ర ఆడియో శనివారం హైదరాబాద్ లోని విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి కాపీను హీరో నాని కు అందించారు. బోయపాటి శ్రీను థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయ్యింది. ఈ సందర్భంగా..
అల్లు అరవింద్ మాట్లాడుతూ "మారుతి విచిత్రమైన కాన్సెప్ట్స్ తో చిత్రాలను తెరకెక్కిస్తాడు. ఈ సినిమా కథ నాకు చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేసాను. మతిమరుపు ఉన్న మానవత్వం గల వ్యతి సినిమా ఇది. వంశి, ప్రమోద్ లు నిజాయితీ గాల నిర్మాతలు. వారితో అసోసియేట్ అయ్యి సినిమా చేయడం ఆనందంగా ఉంది. నేను షూటింగ్ కు వెళ్ళకపోయినా వంశి, ప్రమోద్ లు దగ్గరుండి సినిమా పనులు చూసుకున్నారు. అలానే బన్నీ వాసు నా ఫ్యామిలీ మెంబర్ లాంటివాడు. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి నా థాంక్స్" అని చెప్పారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ "నాని నటించే సినిమాలన్నీ నేను తప్పకుండా చూస్తాను. తన కామెడీ టైమింగ్, తెలుగు భాషపై ఉన్న పట్టు, సినిమా పట్ల ఉండే సెన్సిబిలిటీస్ నాకు చాలా నచ్చుతాయి. తను నటించిన సినిమాలన్నింటిలో భలే భలే మగాడివోయ్ పెద్ద హిట్ సినిమా అవుతుంది. లావణ్య తెలుగమ్మాయనుకున్నాను. అంత చక్కగా డైలాగ్స్ చెప్తుంది. గోపి సుందర్ లవ్లీ మ్యూజిక్ ఇచ్చాడు. బన్నీ వాసుకు ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్స్ కొడతాడు. యు.వి క్రియేషన్స్ సంస్థపై నాకు చాలా అభిమానం ఉంది. కొత్త డైరెక్టర్స్ ను, కొత్త ఐడియాస్ ను ప్రోత్సహిస్తారు. మారుతి చిన్నప్పటి నుండి నాకు మంచి స్నేహితుడు. వీరందరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ "కసితో చాలా కష్టపడి తక్కువ వ్యవధిలో చేసిన చిత్రమిది. సినిమాలలో చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమా, చెడ్డ సినిమా అని ఉంటుంది. ఈ చిత్రం ఓ మంచి చిత్రంగా తెలుగు పరిశ్రమలో నిలిచిపోతుంది" అని చెప్పారు.
మారుతి మాట్లాడుతూ "కొత్తజంట సినిమా తరువాత నన్ను చాలా మంది ప్రేమకథా చిత్రం లాంటి సినిమా చేయమని అడిగారు. నేను చేసే చిత్రం భిన్నంగా ఉండాలని మతిమరుపు అనే కాన్సెప్ట్ తీసుకొని సినిమా మొదటి భాగం వంశికు చెప్పగానే ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్పారు. ఆ తరువాత అల్లు అరవింద్ గారికి వినిపించగానే నవ్వుతు ఎంజాయ్ చేసారు. కథపై కాన్ఫిడెన్స్ పెరిగి సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. నాని మంచి నటుడు. తను యాక్టర్ అయిన నాకు మంచి ఫ్రెండ్ అయిపోయాడు. అందాల రాక్షసి ఫేం లావణ్యను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నాం. గోపి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. 'ఎందరో మహానుభావులు' అనే పాటను చాలా స్టైలిష్ గా తీసాడు. పగలు, రాత్రి అని తేడా తెలియకుండా అందరు చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్" అని చెప్పారు.
నాని మాట్లాడుతూ "గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సినిమాలు చూస్తూ పెరిగాను. ఈరోజు ఆ సంస్థకు సంబంధించిన బ్యానర్ లో పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓ నటునిగా చాలా ఎంజాయ్ చేస్తూ నటించిన సినిమా ఇది. లావణ్య బాగా పెర్ఫార్మ్ చేసింది. ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ ప్రమోద్, వంశి. వారితో కలిసి పని చేయడం హ్యాపీ గా అనిపించింది. గోపి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతుంది" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి, కృతిక, బాబీ, శరత్ మరార్, బన్నీ వాసు, జెమినీ కిరణ్, శోభు యార్లగడ్డ, శ్రీమణి, రామజోగయ్య శాస్త్రి, భాస్కర్ భట్ల తదితరులు పాల్గొన్నారు.