'ఘర్షణ' , 'ఏ మాయ చేసావే' , 'ఎటో వెళ్ళిపోయింది మనసు' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు గౌతంమీనన్. 'ఎటో వెళ్ళిపోయింది మనసు' చిత్రం తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న గౌతంమీనన్ నితిన్, యామీగౌతమ్ జంటగా ఫోటాన్ కతాస్ బ్యానర్ పై ప్రేమ్ సాయి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను ఈ నెల 20న విడుదల చేసి చిత్రాన్ని సెప్టెంబర్ 11న సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా గౌతంమీనన్ మాట్లాడుతూ
సింపుల్ లవ్ స్టొరీ..
కొరియర్ బోయ్ గా పని చేసే ఓ వ్యక్తి ప్రేమ కథే ఈ చిత్రం. ఇదొక సింపుల్, స్వీట్ లవ్ స్టొరీ. సినిమా రెండవ భాగంలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. సినిమాలో మొత్తం నాలుగు పాటలుంటాయి. మూడు పాటలకు మ్యూజిక్ కార్తిక్ చేయగా ఒక పాటను అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసారు. సందీప్ చౌహాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. నితిన్, యామి అధ్బుతంగా నటించారు.
నేను పవన్ గారికి ఫ్యానే..
ఈ సినిమా టైటిల్ సజెస్ట్ చేసింది నితినే. తను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్. మా డైరెక్టర్, నేను కూడా పవన్ గారికి అభిమానులమే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఒక సీన్ ఉంటుంది. ఆడియన్స్ అంతా సినిమాను ఎంజాయ్ చేస్తారు.
ప్రేమ్ సాయి బాగా డైరెక్ట్ చేసాడు..
ఈ చిత్రానికి డైరెక్టర్ గా పని చేసిన ప్రేమ్ నాకు సినిమా కథ చెప్పగానే చాలా నచ్చింది. అయితే మొదట తమిళంలో రిలీజ్ చేయాలనుకున్నాం. కాని ఇదొక మంచి లవ్ స్టొరీ కనుక తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. ప్రేమ్ సాయి ప్రభుదేవా గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. తనకు ఇది మొదటి సినిమా అయినా బాగా డైరెక్ట్ చేసాడు. హ్యూమర్ అధ్బుతంగా చూపించాడు. సినిమా సూపర్ హిట్ అనిపించుకొనే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి.
నా సినిమాకు క్లైమాక్స్ రాసుకోను..
నేను ఏ సినిమా డైరెక్ట్ చేసిన డెబ్బై నుండి ఎనబై శాతం బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాను. ఆ స్క్రిప్ట్ తోనే షూటింగ్ మొదలుపెడతాను. షూటింగ్ సమయంలో క్లైమాక్స్ రాసుకుంటాను. 'ఏ మాయ చేసావే' చిత్రానికి తెలుగులో హ్యాపీ ఎండింగ్ ఇస్తే తమిళంలో మాత్రం సాడ్ ఎండింగ్ ఇచ్చాను. కాని ఈ సినిమా తమిళంలో, తెలుగులో క్లైమాక్స్ ఒక్కటే.
ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్నాం..
ఈ సినిమా షూటింగ్ తెలుగులో ఎప్పుడో కంప్లీట్ అయింది. తెలుగులో, తమిళంలో ఈ సినిమా ఒకేసారి రిలీజ్ చేయాలనుకున్నాం. కాని తమిళంలో కొన్ని ఇష్యూస్ ఉండడం వలన షూటింగ్ లేట్ అయింది. అందుకే రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది.
ఎవరి ఇమేజ్ కు వారు తగ్గట్లుగా..
తమిళంలో ఈ సినిమాలో జై హీరోగా నటించాడు. అక్కడ జై కు కామెడీ చేయడంలో క్రేజ్ ఉంది. దానికి తగ్గట్లుగా స్క్రిప్ట్ కూడా రెడీ చేసారు. అలానే తెలుగులో నితిన్ కు రొమాంటిక్ ఇమేజ్ బాగా ఉంది. అందుకే కాస్త లవ్ ట్రాక్, యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉండేలా చూసుకున్నారు.
ప్రొడ్యూసర్ అవ్వాలనే ఇండస్ట్రీకు వచ్చా..
నేను మొదట నిర్మాతగా చేయాలనే ఇండస్ట్రీకు వచ్చాను. కాని నన్ను నిర్మాతగా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. పెద్ద హీరోలైతే వాళ్ళ సినిమాలను వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటారు. నాకు ప్రొడ్యూస్ చేసే అవకాశాలు రాలేదు. అందుకే నా సొంతగా సినిమాలను నేనే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాను. అయితే నేను దర్శకత్వం వహించే చిత్రాలకు వేరే వాళ్ళు నిర్మాతగా వ్యవహరించినపుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చదు. దర్శకునిగా నా బాధ్యత ఏంటో నాకు తెలుసు. ప్రొడక్షన్ విషయాలు ఏమైనా డిస్కస్ చేస్తేనే వింటాను.
వేరే జోనర్ లో సినిమా చేస్తున్నా..
గౌతంమీనన్ అంటే సీరియస్ పోలీస్ పాత్రలు, లవ్ స్టొరీలు మాత్రమే తీయగలడు అనుకుంటున్నారు. అందుకే నేను నాగ చైతన్య తో సింపుల్ యాక్షన్ సినిమా చేస్తున్నాను. తెలుగులో నేరుగా పెద్ద సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఆ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.