Advertisement
Google Ads BL

'అబ్బాయితో అమ్మాయి' బిజినెస్ అదిరిందట!


ఏ సినిమా అయినా బిజినెస్ ఎప్పుడు అవుతుంది? స్టార్ హీరో సినిమా అయితే కొబ్బరికాయ కొట్టినరోజునే జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఫస్ట్ లుక్ విడుదలయ్యాక అవుతుంది. అదే ఓ అప్ కమింగ్ హీరో సినిమా అయితే... బిజినెస్ అవ్వడానికి నానా తంటాలు పడాల్సిందే. కానీ, 'అబ్బాయితో అమ్మాయి' అనే చిత్రం విషయంలో ఇది రివర్శ్ లో జరిగింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా ఇంకా విడుదల కాలేదు. ఈలోపు నాలుగు జిల్లాల్లో బిజినెస్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక చిన్న సినిమాకి ఇలా జరగడం సంచలనమే. ఇంతకీ ఈ చిత్రంలో హీరో ఎవరు అంటే.. 'నాగశౌర్య'. హీరోయినేమో ముంబై భామ పాలక్ లల్వాని. దర్శకుడేమో రమేశ్ వర్మ. జెజె సినిమాస్ పతాకంపై జక్కం వందనా అలేఖ్య ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఎప్పుడు మొదలుపెట్టారో కానీ సైలెంట్ గా టాకీ పార్ట్ కూడా పూర్తి చేసేశారు. ఇక, పాటలు మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. రేపు (15.08.) ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నారు. 

Advertisement
CJ Advs

ఈ చిత్రం వైజాగ్ విడుదల హక్కులను ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ 63లక్షల రూపాయలకు సొంతం చేసుకున్నారు. కృష్ణ, గుంటూరు, వెస్ట్ ఏరియాల్లో కూడా బిజినెస్ పూర్తి కావడం విశేషం.  ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ర్టో ఇళయరాజా పాటలు స్వరపరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం పాటలను సెప్టెంబర్ 6న విడుదల చేయాలనుకుంటున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs