Advertisement
Google Ads BL

ఎన్టీఆర్, సుకుమార్ ల సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!


జనవరి 8 సంక్రాంతి కానుకగా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌.. 'ఆర్య' సుకుమార్‌ కాంబినేషన్‌లో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ కన్‌ఫర్మ్‌ చేసారు. 

Advertisement
CJ Advs

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ''ప్రస్తుతం లండన్‌లో సెప్టెంబర్‌ 20 వరకు జరిగే షెడ్యూల్‌తో మాగ్జిమమ్‌ వర్క్‌ ఫినిష్‌ అవుతుంది. ఆ తర్వాత స్పెయిన్‌లో జరిగే 20 రోజుల షెడ్యూల్‌తో దాదాపుగా సినిమా పూర్తవుఅంది. హండ్రెడ్‌ పర్సెంట్‌ సంక్రాంతి కానుకగా జనవరి 8న వరల్డ్‌వైడ్‌గా చాలా గ్రాండ్‌గా ఈ సినిమాని రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం. ఎన్టీఆర్‌ కెరీర్‌కి, మా బేనర్‌కి ఇది ప్రెస్టీజియస్‌ మూవీ అవుతుంది. సుకుమార్‌ ఎక్స్‌ట్రార్డి నరీగా తీస్తున్నాడు. షెడ్యూల్‌ ప్లాన్‌ చేసినట్టుగా పర్‌ఫెక్ట్‌గా జరుగుతోంది'' అన్నారు. 

దర్శకుడు 'ఆర్య' సుకుమార్‌ మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ చిత్రం కోసం అత్యంత ఖరీదైన బైక్‌ని ఉపయో గిస్తున్నాం. ఈ బైక్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. లుక్‌, కాస్ట్యూమ్స్‌ వైజ్‌గా స్టైలిష్‌ క్యారెక్టర్‌లో ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. అలాగే నాకెంతో ఇష్టమైన ప్రొడ్యూసర్‌ ప్రసాద్‌గారి బేనర్‌లో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. ఖర్చుకి వెనుకాడకుండా చాలా గ్రాండియర్‌గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కో-ప్రొడ్యూసర్‌ బాపి పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో ఈ ప్రాజెక్ట్‌ని డీల్‌ చేస్తున్నారు.'' అన్నారు. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌ లతోపాటు మరికొంత మంది భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: విజయ్‌ కె.చక్రవర్తి, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌, కో-ప్రొడ్యూసర్‌: భోగవల్లి బాపినీడు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుకుమార్‌.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs