కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర 'ఉప్పి 2' పేరుతో రూపొందించిన చిత్రాన్నిభవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) ‘ఉపేంద్ర`2’ అనే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హీరోగా నటించిన ఉపేంద్ర ఈ చిత్రానికి దర్శకుడిగా కూడా వ్యవహరించారు. పారుల్ యాదవ్, క్రిస్టినా అకిహివా ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన దర్శకుడు వి.వి.వినాయక్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి కాపీను హీరో ఉపేంద్ర భార్య ప్రియాంకకు అందించారు. గురుకిరణ్ సంగీతం అందించిన ఈ ఆడియో జంగ్లీ మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయింది. ఈ సందర్భంగా..
వి.వి.వినాయక్ మాట్లాడుతూ ‘‘బుజ్జి పుట్టినరోజున ఈ సినిమా ఆడియో విడుదల కావడం సంతోషంగా ఉంది. ‘ఓం’ సినిమా చూసినప్పటి నుండి ఉపేంద్రగారి సినిమాంటే నాకు చాలా ఇష్టం కలిగింది. ఆయనంటే విపరీతమైన ప్యాషన్ ఉండేది. చాలా స్టయిలిష్‌గా ఉంటాడు. ఉపేంద్ర సినిమా ఎడిటింగ్ సమయంలో ఆయన్ను మీట్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఆయనతో చేసిన జర్నీ మరచిపోలేను. నల్లమలుపు బుజ్జి ఈ సినిమా ఉపేంద్రగారితో ఉన్న స్నేహం వల్ల చేస్తున్నాడు. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. ఎవరూ ఊహించనంత కొత్తగా ఈ సినిమా ఉంటుంది’’ అని అన్నారు.
హీరో ఉపేంద్ర మాట్లాడుతూ ‘‘టాలెంట్ అనేది గొప్పది కాదు. కానీ దాన్ని గుర్తించే టాలెంట్ చాలా గొప్పది. నా టాలెంట్‌ను గుర్తించి నా గురించి అందరూ మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంది. 'రా' నా జీవితంలో మర్చిపోలేని సినిమా. ఆ సమయంలో నాతో ఆ సినిమా చేసి హిట్ ఇచ్చిన బుజ్జిగారు మళ్లీ నన్నుఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేద్దామని అడిగారు. కన్నడంలో ‘ఉప్పి`2’ రిలీజ్ అయ్యే రోజునే తెలుగులో రిలీజ్ చేయాలని మూడు రోజుల్లో బుజ్జి గారు సినిమాని సిద్ధం చేసేశారు. కన్నడంలో నేను ఈ సినిమాకు ఎలాంటి ప్రమోషన్ చేయట్లేదు. నా ఫ్యాన్స్ ఆడియోను రిలీజ్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు’’ అని చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ గురుకిరణ్ మాట్లాడుతూ "ఉపేంద్ర గారు నటించిన 'ఏ' సినిమాలో సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చి ఇండస్ట్రీకు పరిచయం చేసారు. 'రా' చిత్రంతో నల్లమలుపు బుజ్జి గారు నన్ను తెలుగు ఇండస్ట్రీ కు పరిచయం చేసారు. ఉపేంద్ర గారు, బుజ్జి గారి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి" అని చెప్పారు.
గోపిచంద్ మలినేని మాట్లాడుతూ ‘‘ఉపేంద్రగారికి నేను పెద్ద అభిమానిని. ‘ఉపేంద్ర’ సినిమాని చాలా సార్లు చూశాను. ఏ విషయాన్నైనా నేరుగా చెప్పగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ ఆయన. ఇప్పుడు ‘ఉపేంద్ర 2’ రిలీజ్ కాబోతోంది. సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’అని చెప్పారు
పరుచూరి ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఉపేంద్ర సినిమా హిట్ అయిన విధంగానే ‘ఉపేంద్ర`2’ ఆడియో, సినిమా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఉపేంద్రగారు ప్రతి సినిమాని కొత్తగా చెయ్యాలని ప్రయత్నిస్తుంటారు. చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు.
వీరుపోట్ల మాట్లాడుతూ ‘‘ఉపేంద్ర గారు గట్స్‌తో సినిమా తీస్తారు. గురుకిరణ్‌గారి మ్యూజిక్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. అలాగే ఈ సినిమా ఆడియో కూడా పెద్ద హిట్టవుతుంది. నల్లమలుపు బుజ్జికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
కొడాలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ‘‘ ఉపేంద్ర సినిమాలాగానే ఉపేంద్ర2 సినిమా పెద్ద సక్సెస్ కావాలి. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
శశాంక్ వెన్నెకంటి మాట్లాడుతూ ‘‘ఒకప్పుడు ‘ఉపేంద్ర’ చిత్రంలో నేను అనే క్యారెక్టర్‌తో సక్సెస్ కొట్టిన ఉపేంద్రగారు ఇప్పుడు ‘ఉపేంద్ర`2’తో నువ్వు అనే కాన్సెప్ట్‌తో మరోసారి ఖచ్చితంగా సక్సెస్ కొడతారు’’ అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రియాంక, క్రిస్టినా అకిహివా, పారుల్ యాదవ్, పరుచూరి ప్రసాద్, డి.వి.వి.దానయ్య, ఛోటా కె.నాయుడు, స్రవంతి రవికిషోర్, రాజా రవీంద్ర, వజ్ర శ్రీనివాస్, సింధూర పువ్వు కృష్ణారెడ్డి, శశాంక్ వెన్నెకంటి, వక్కంతం వంశీ, దామోదర్ ప్రసాద్, మల్లిరెడ్డి సత్యనారాయణ, కిషోర్ పార్థసాని, ఠాగూర్ మధు, మహేంద్ర, రఘుబాబు తదితయి పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: అశోక్ కశ్యప్, ఎడిటింగ్: శ్రీ, మాటలు: శశాంక్ వెన్నెలకంటి, సంగీతం: గురుకిరణ్, నిర్మాత: నల్లమలుపు బుజ్జి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఉపేంద్ర.