రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ మరియు ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్. సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సినిమా చూపిస్త మావ'.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో అవికా గోర్, హీరో రాజ్ తరుణ్ వారి అనుభవాలను విలేకర్లతో ముచ్చటించారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ "ఉయ్యాల జంపాల సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాను. ప్రసన్న, డైరెక్టర్ స్టొరీ చెప్పగానే కథ నచ్చి ఒప్పుకున్నాను. ఇదొక మంచి మాస్ ఎలిమెంట్స్ తో కూడిన లవ్ స్టొరీ. ఫైట్స్ ఏమి ఉండవు. సినిమా బాగా వచ్చింది. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ ఆల్బం లోని ‘పిల్లి కళ్ల పాప’ పాట నాకు బాగా నచ్చింది. రావు రమేష్ గారు అధ్బుతంగా నటించారు. ఆయన దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. అవికాతో రెండోసారి వర్క్ చేస్తున్నాను. తనంటే నాకు మొదటి నుండి చాలా గౌరవం. తనతో మళ్ళి మళ్ళి వర్క్ చేయాలనుంది. డైరెక్టర్ త్రినాధ్ గారు కూల్ పర్సన్. ప్రొడ్యూసర్స్ అందరూ బాగా ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి చేసిన చిత్రమిది" అని చెప్పారు.
అవికా గోర్ మాట్లాడుతూ "ఈ సినిమాలో నాదొక క్యూట్, టిపికల్ టీనేజ్ అమ్మాయి క్యారెక్టర్. ప్రతి అమ్మాయికి నా పాత్ర కనెక్ట్ అవుతుంది. సినిమాలో డైలాగ్స్ హైలైట్ గా నిలుస్తాయి. ఇందులో రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. ఆ పాటలో నేను డాన్సు కూడా చేసాను. నాకు చాలా నచ్చే సాంగ్ అది. డైరెక్టర్ గారు నాకు చెప్పిన కథను ఇంకా బాగా తీసారు. టాలెంట్ ఉన్న పర్సన్. రాజ్ చాలా సపోర్టివ్ యాక్టర్. నాకు బాష రాక డైలాగ్స్ చెప్పినప్పుడు కాస్త ఇబ్బంది పడినప్పుడు చాలా హెల్ప్ చేసాడు. సినిమా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పారు.