Advertisement
Google Ads BL

'కలయా నిజమా' సినిమా విడుదలకు సిద్ధం!


రాజ్, గీతా భగత్ జంటగా మహేష్ హిమ మూవీస్ మరియు ఐ ఫాంటసీ డిజైన్ స్టూడియోస్ సంయుక్తంగా మహేష్ దర్శకత్వంలో నిర్మించబడిన సినిమా 'కలయా నిజమా'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 7న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..

Advertisement
CJ Advs

దర్శకనిర్మాత మహేష్ మాట్లాడుతూ "భార్య భర్తల జీవితాలలో ప్రేమ వర్సెస్ ద్వేషం అనే ఆట ఆద్యంతం రసవత్తరంగా సాగే సోషియో ఫాంటసీ కథాంశంతో గ్రాఫిక్స్ హైలైట్స్ గా ఈ చిత్రాన్ని రూపొందించాం. సెన్సార్ కార్యక్రమాల్లో ఈ చిత్రం క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది. ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఆగస్ట్ 8న యు.కె, యు.ఎస్ లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలానే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు. 

ఐ ఫాంటసీ డిజైన్ స్టూడియోస్ అధినేత నవీన్ మాట్లాడుతూ "ఉన్న లిమిటెడ్ బడ్జెట్ లో స్ట్రాంగ్ కంటెంట్ తో రూపొందించిన చిత్రమిది. ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. టీమ్ అందరికీ నా అభినందనలు" అని చెప్పారు.

ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్: వంశీ కృష్ణ, సినిమాటోగ్రఫీ: వి.కె.రామరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ జోయెల్, ఎడిటర్: శ్రీనివాస్ మోపర్తి, మహేష్, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: మహేష్. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs