ఇళయదళపతి విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందుతున్న భారీ చిత్రం 'పులి'. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్, హన్సిక హీరోయిన్లుగా నటించగా, ఆలిండియా స్టార్ శ్రీదేవి, కన్నడ స్టార్ సుదీప్ ప్రత్యేక పాత్రలు పోషించారు. కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియోను ఆగస్ట్ 2న చెన్నయ్‌లో విడుదల చేయబోతున్నారు. తమిళ్‌లో విజయ్‌కి వున్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే ఆడియో ఫంక్షన్‌ని కూడా చాలా గ్రాండ్ చెయ్యాలని దర్శకనిర్మాతలు డిసైడ్ అయ్యారు. భారీ బడ్జెట్‌తో త్రిభాషా చిత్రంగా రూపొందుతున్న 'పులి' ఆడియో ఫంక్షన్‌కి హాజరు కావాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్‌లను దర్శకనిర్మాతలతోపాటు హీరో విజయ్ కూడా ఆహ్వానించారట. తప్పకుండా ఆడియో రిలీజ్‌కి వస్తామని ఇద్దరూ మాట ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యే అవకాశం వున్నా, సాధారణంగా తన ఆడియో ఫంక్షన్స్‌కి తప్ప బయటి ఆడియో ఫంక్షన్లకు ఎక్కువగా అటెండ్ అవ్వని మహేష్ ఈ ఆడియో ఫంక్షన్‌కి వెళ్తాడా? లేదా? అనేది డౌటే. ఒకవేళ ఇద్దరూ ఈ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొంటే అది గొప్ప విశేషమే అవుతుంది.