Advertisement

'లక్ష్మిదేవి సమర్పించు నేడే చూడండి' టైటిల్ లోగో లాంచ్!


కృష్ణ-జనని, అఖిల్-భార్గవి, చరణ్-ప్రజ్ఞ జంటలుగా కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో జాకి అతిక్ దర్శకత్వంలో మేరువ సుబ్బారెడ్డి నిర్మాతగా సిరాజ్ సహనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం ''లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి'' చిత్ర లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నరేష్ లోగోను ఆవిష్కరించారు. తనికెళ్ళ భరణి, శోభారాణి, రామకృష్ణగౌడ్ కలిసి ప్రమోషనల్ సాంగ్ లాంచ్ చేసారు. ఈ సందర్భంగా..

Advertisement

దర్శకుడు మారుతి మాట్లాడుతూ "డైరెక్టర్ గారి మీద నమ్మకంతో నిర్మాతలు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఖచ్చితంగా సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్" అని చెప్పారు.

తనికెళ్ళ భరణి మాట్లాడుతూ "చిత్ర బృందానికి నా అభినందనలు. ఈ సినిమాతో నిర్మాతలకు లాభాలు రావాలని మరిన్ని చిత్రాలను నిర్మించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

నరేష్ మాట్లాడుతూ "ఆడు మగాడ్ర బుజ్జి సినిమాను ఎక్కడ కాంప్రమైస్ అవ్వకుండా నిర్మించిన ఈ నిర్మాతలు ఈ చిత్రాన్ని కూడా అంతే కమిట్మెంట్ తో నిర్మించారు. ఎంటర్టైనింగ్ గా సాగే చిత్రమిది" అని చెప్పారు.

రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ "డిస్ట్రిబ్యూషన్ లో అనుభవం ఉన్న సుబ్బారెడ్డి గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది" అని చెప్పారు.

నిర్మాతలు సుబ్బారెడ్డి, సిరాజ్ లు మాట్లాడుతూ "ఇదొక సోషియో ఫాంటసీ చిత్రం. చలన చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి ఆదరణ పెరిగి వారిని దైవంగా భావిస్తున్న ప్రేక్షకులను గమనించిన దేవుళ్ళు మనమే చిత్ర నిర్మాణం ఎందుకు చేయకూడదని భావించి లక్ష్మీదేవి నిర్మాతగా 'లక్ష్మిదేవి సమర్పించు నేడే చూడండి' అనే చిత్ర నిర్మాణం సంకల్పించి, చిత్ర నిర్మాణంలో ఉన్న సాధకబాధలు స్వయంగా అనుభవపూర్వకంగా గ్రహించి చిత్ర నిర్మాతలు పడే రకరకాల సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ చిత్రం. ఆగస్ట్ మూడవవారంలో ఆడియో లాంచ్ చేసి ఆ నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.  

రఘురామ్ మాట్లాడుతూ "సినిమా చూసాను. చాలా బాగా వచ్చింది. ఈ చిత్రంలో ప్రమోషనల్ సాంగ్ చేసే అవకాసం ఇచ్చిన దర్శకనిర్మాతలకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

ఈ చిత్రానికి సంగీతం: శ్రీకోటి, ఫోటోగ్రఫీ: రఘు అర్ బళ్ళారి, సహా నిర్మాత: సిరాజ్, నిర్మాత: మేరువ సుబ్బారెడ్డి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జాకి అతిక్.

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement