Advertisement
Google Ads BL

‘కేటుగాడు’ ఆడియో రిలీజ్!


తేజస్‌, చాందిని జంటగా వి.ఎస్‌.పి. తెన్నేటి సమర్పణలో వెంకటేష్‌ మూవీస్‌, 100 క్రోర్స్‌ అకాడమీ పతాకాలపై కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేష్‌ బాలసాని నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘కేటుగాడు’. సాయికార్తీక్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కె.యస్‌.రామారావు బిగ్‌ సీడీని  ఆవిష్కరించారు. ఆడియో సీడీలను కె.యస్‌.రామారావు ఆవిష్కరించి ప్రకాష్‌ రాజ్‌కి తొలి సీడీని అందించారు. థియేట్రికల్‌  ట్రైలర్‌ను ప్రకాష్‌ రాజ్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా...

Advertisement
CJ Advs

కె.యస్‌.రామారావు మాట్లాడుతూ ‘‘మొదట దర్శక నిర్మాతలు, తేజస్‌ వచ్చి నన్ను కలిసి కథ చెప్పినప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. సాయికార్తీక్‌ ఏ సినిమాకి మ్యూజిక్‌ చేసినా మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకి కూడా మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ప్రతి పాట చాలా డిఫరెంట్‌గా ఉంది. జోషి సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా కనపడుతుంది. దర్శకుడు కిట్టు ప్రతి షాట్‌ను చాలా జాగ్రత్తగా చేశాడు. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

ప్రకాష్‌ రాజ్‌ మాట్లాడుతూ ‘‘తేజస్‌ డైరెక్షన్‌ టీమ్‌లో వర్క్‌ చేసినందు వల్ల తనకి నటన గురించి మంచి అవగాహన వుంది. తనని ఉలవచారు బిర్యాని టైం లో కలిశాను. తనలోని ఎనర్జీ బాగా నచ్చింది. తను మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకుంటాడు. సాయికార్తీక్‌ మ్యూజిక్ చాలా బావుంది. సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుంది’’ అన్నారు.  

ర్శకుడు కిట్టు నల్లూరి మాట్లాడుతూ ‘‘నాపై అభిమానంతో సాయి కార్తిక్ మంచి మ్యూజిక్‌ అందించాడు. ఈ కథ చెప్పగానే దాన్ని నమ్మి సినిమా తియ్యడానికి ముందుకొచ్చిన నిర్మాతలు వెంకటేష్‌గారికి, వి.ఎస్‌.పి.తెన్నేటిగారికి థాంక్స్‌. ఒక మంచి సినిమా చెయ్యడానికి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్‌ చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’’ అని అన్నారు. 

నిర్మాత వెంకటేష్‌ బాలసాని మాట్లాడుతూ ‘‘మా బేనర్‌లో చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, పనిచేసిన టెక్నీషియన్స్‌ అంతా ఎంతో బాగా నన్ను సపోర్ట్‌ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. సాయికార్తీక్‌గారు చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. జోషి ఫోటోగ్రఫీ సినిమాకు ప్లస్ అవుతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. 

హీరో తేజస్‌ మాట్లాడుతూ ‘'సాయికార్తీక్‌ నాకు మంచి స్నేహితుడు. మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. వెంకటేష్‌గారి వంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం.కిట్టు మంచి కథ తేవడంతో ఈ సినిమా స్టార్ట్‌ అయింది. ఈ చిత్రంలో నా కోస్టార్‌ చాందినితో వర్క్‌ చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. తెలుగు హీరోయిన్‌ కావడం వల్ల సెట్‌లో ఎలాంటి ప్రాబ్లమ్‌ లేకుండా డైలాగ్స్‌ చెప్పేది. మమల్ని ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం’’ అని అన్నారు. 

సంగీత దర్శకుడు సాయికార్తీక్‌ మాట్లాడుతూ ‘‘తేజస్‌తో మంచి పరిచయం ఉంది. దర్శకుడు కిట్టు నన్ను అన్నయ్య అని పిలుస్తుంటాడు. నా సినిమాలా భావించి ఈ చిత్రానికి పనిచేశాను’’ అని అన్నారు. 

హీరోయిన్‌ చాందిని చౌదరి మాట్లాడుతూ ‘‘ఇంత బ్యూటిఫుల్‌ టీమ్‌తో వర్క్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వెంకటేష్‌గారు సినిమా కోసం ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. కిట్టుగారు నాపై నమ్మకంతో మంచి పెర్‌ఫార్మెన్స్‌ రోల్‌ను నాకు ఇచ్చారు. సాయికార్తీక్‌ బ్యూటిఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. తేజస్‌ మంచి కోస్టార్‌. ఆడియో, సినిమా తప్పకుండా పెద్ద హిట్టవుతాయి’’ అన్నారు. 

ఈ కార్యక్రమంలో ఆర్‌.పి.పట్నాయక్‌, ప్రతాని రామకృష్ణగౌడ్‌, వి.ఎస్‌.పి.తెన్నేటి, సప్తగిరి, అజయ్‌, జె.వి.మోహన్‌గౌడ్‌, సుశాంత్‌, మల్కాపురం శివకుమార్‌, మారుతి, గొట్టిముక్కల పద్మారావు తదితరులు పాల్గొన్నారు.

తేజస్‌, చాందిని, సుమన్‌, రాజీవ్‌ కనకాల, సప్తగిరి, స్నిగ్ధ, భావన, చంద్రశేఖర్‌, అజయ్‌, పృథ్వి, ప్రవీణ్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, అదుర్స్‌ రఘు, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: మల్హర్‌భట్‌ జోషి, పాటలు: శ్రీమణి, కాసర్ల శ్యామ్‌, భాషాశ్రీ, బాలాజీ, బి.సుబ్బరాయశర్మ, మాటలు: పి.రాజశేఖరరెడ్డి, ఎడిటింగ్‌: పి.వెంకటేశ్వరరావు, భాషాశ్రీ, ఫైట్స్‌: నందు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అచ్చిబాబు ఎం., సంపత్‌కుమార్‌ ఎ., సమర్పణ: వి.ఎస్‌.పి.తెన్నేటి, నిర్మాత: వెంకటేష్‌ బాలసాని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కిట్టు నల్లూరి. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs