రాజ్ తరుణ్, అవికా గోర్ జంటగా అంజిరెడ్డి ప్రొడక్షన్స్ మరియు ఆర్.డి.జి.ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్. సమర్పణలో ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా పతాకాలపై త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో బోగది అంజిరెడ్డి, బెక్కం వేణుగోపాల్, రూపేష్ డి.గోహిల్, జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సినిమా చూపిస్త మావ'. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 14న విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో..
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ "రీసెంట్ గా విడుదలయిన ఈ సినిమా ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను ఇప్పటివరకు మూడు లక్షల మంది వీక్షించారు. ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. ఆగస్ట్ 1వ తారీఖు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.
దర్శకుడు త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ "ఈ సినిమాపై అందరికి చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి ప్రయత్నించాం. అవికా గోర్, రాజ్ తరుణ్ జంటకు ఫ్యామిలీస్ బాగా ఎట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళనే టార్గెట్ చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. రియాల్టీకు దగ్గరగా ఉండే చిత్రమది. అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది" అని చెప్పారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ "ఈ సినిమాలో మూడు పాటలు రాసాను. టీం అంతా చిత్రంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం" అని చెప్పారు.
బ్రహ్మానందం, రావు రమేష్, తోటపల్లి మధు, కృష్ణభగవాన్, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, మేల్కొటే, జయలక్ష్మి, మాధవి, సునీతవర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పోస్టర్స్ డిజైన్: విక్రమ్‌స్వామి, ఛీఫ్ ఆసోసియేట్ డైరెక్టర్: విశ్వనాధ్ అరిగెల, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సాయికృష్ణ, సంభాషణలు: ప్రసన్న జె.కుమార్, ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సినిమాటోగ్రఫి: సాయి శ్రీరామ్-దాశరధి శివేంద్ర, నిర్మాతలు: బోగాది అంజిరెడ్డి-రూపేష్ డి.గోహిల్-బెక్కెం వేణుగోపాల్(గోపి)-జి.సునీత, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: త్రినాధరావు నక్కిన.