అజయ్ కుమార్, వేద జంటగా దేవెంకి ఫిల్మ్స్ పతాకంపై రమేష్ రెడ్డి తుమ్మల దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న సినిమా 'ది ఇండియన్ పోస్ట్ మ్యాన్'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణా రాష్ట్ర హొమ్ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి సీడీను దర్శకుడు రమేష్ రెడ్డి కి అందించారు. ఈ సందర్భంగా..
నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ "తెలంగాణా కోసం ఎందరో మహానుబావులు ఉద్యమాలు చేసారు. పోలీసుల కాల్పుల్లో ప్రాణాలను సైతం కోల్పోయారు. ఎందరో త్యాగాల ఫలితమే మన తెలంగాణా రాష్ట్ర ఆవిష్కరణ. అలాంటి తెలంగాణా కథకు సంబంధించిన సినిమాను నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆడియో, సినిమా మంచి విజయాన్ని సాధించాలి. చిత్ర బృందానికి మంచి పేరు రావాలి" అని చెప్పారు.
దర్శకనిర్మాత రమేష్ రెడ్డి తుమ్మల మాట్లాడుతూ "1969-1972 లో తెలంగాణా నేపధ్యంలో జరిగిన ఓ పోస్ట్ మ్యాన్ ప్రేమకథే ఈ చిత్రం. ఈ చిత్రాన్ని గ్లోబల్ ఆడియన్స్ కోసం తెరకెక్కిస్తున్నాం. ఇది డాక్యుమెంటరీ కాదు ఓ కమర్షియల్ చిత్రానికి హ్యూమన్ టచ్ జోడించి తీసాం" అని చెప్పారు.
హీరో అజయ్ కుమార్ మాట్లాడుతూ "ఇది నా మొదటి సినిమా. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నాకు ఈ అవకశం ఇచ్చిన దర్శకునికి నా థాంక్స్" అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: సాయి చంద్, ఎల్.ఎమ్.ప్రేమ్, ఎడిటింగ్: రామారావ్, ఫోటోగ్రఫీ: సురేష్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం-నిర్మాత: రమేష్ రెడ్డి తుమ్మల.