Advertisement

'కలయా నిజమా' మూవీ ఆడియో లాంచ్!


మహేష్ హిమ మూవీస్ పతాకంపై రాజ్, గీతా భగత్ జంటగా మహేష్ దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న సినిమా 'కలయా నిజమా'. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ గురువారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లోని జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిర్మాత దామోదరప్రసాద్ బిగ్ సీడీను విడుదల చేసారు. ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి సీడీ ను దర్శకుడు మహేష్ కు అందించారు. వంశీకృష్ణ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలయ్యింది. ఈ సందర్భంగా.. 

Advertisement

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ "ఈ సినిమా కాన్సెప్ట్ నాకు చెప్పినప్పుడు కొత్తగా అనిపించింది. కాని దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు ఒకరే చూసుకోవడం కష్టమవుతుందని మహేష్ కు చెప్పాను. నేను చెప్పిన ఎనిమిది నెలల్లో సినిమాను నిర్మించి నాకు చూపించారు. కేవలం డబ్బు కోసం మహేష్ ఈ సినిమా చేయలేదు. సినిమాపై ఉన్న ప్యాషన్ తో చేసాడు. ఈ చిత్రం ఘన విజయం సాధించి నిర్మాతకు మంచి లాభాలను తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

రేలంగి నరసింహారావు మాట్లాడుతూ "దాసరి గారికి ఈ సినిమా ట్రైలర్ చూపించినపుడు మంచి ఇంప్రెషన్ కలిగింది. భార్య, భర్త ల కాన్సెప్ట్ తో నేను చాలా చిత్రాలను నిర్మించాను కాని ఈ సినిమాలో వారి మధ్య ద్వేషం కలిగితే ఎలాంటి సమస్యలు ఏర్పడతాయని చూపించడం నాకు నచ్చింది. సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ వంశీ కృష్ణ మాట్లాడుతూ "మ్యూజిక్ చేయడానికి మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమాకు దినేష్ మంచి సాహిత్యం అందించారు. నాకు ఈ అవకాసం ఇచ్చిన మహేష్ గారికి, నాకు సహకరించిన సింగర్స్ కు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

దర్శకనిర్మాత మహేష్ మాట్లాడుతూ "ఇదొక ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ. ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన జంట మధ్య ద్వేషం ఏర్పడితే ఎలాంటి పరిణామాలు ఎడురవుతాయనేదే ఈ కథ. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలనేదే ఈ చిత్ర ఇతివృత్తం. ఇదొక వినూత్నమైన ప్రయత్నం. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాం" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో మోహన్ వడ్లపట్ల, హీరో రాజ్, మాధవ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. 

ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్: వంశీ కృష్ణ, సినిమాటోగ్రఫీ: వి.కె.రామరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నవీన్ జోయెల్, ఎడిటర్: శ్రీనివాస్ మోపర్తి, మహేష్, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: మహేష్. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement