ఎంతమంది కొత్తమ్మాయిలు వచ్చినా తనకు మాత్రం తిరుగులేదని చాటుతోంది నయనతార. పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌ల్లో అవకాశాలు అందుకొంటూ దుమ్ము రేపుతోంది. గత రెండు మూడేళ్లుగా క్షణం తీరిక లేకుండా గడుపుతోంది నయన్. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పుడు `ఇక నయనతార కెరీర్ చివరికొచ్చినట్టే` అని మాట్లాడుకొన్నారంతా. కానీ ఆమె జోరు చూస్తుంటే ఈ హవా మరికొన్నాళ్లు సాగుతుందని అర్థమవుతోంది.
తాజాగా నయనతార... ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో ఛాన్స్ అందుకొన్నట్టు తెలిసింది. కార్తీ, దుల్కర్ సల్మాన్‌లతో మణిరత్నం ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నాడు. ఆ సినిమాలో దుల్కర్ సరసన శ్రుతిహాసన్ నటించబోతోంది. కార్తీ కోసం నయనతారని ఎంపిక చేశారు. ఇటీవలే నయనతార కథ విని సినిమా చేయడానికి ఓకే చెప్పేసిందట.
ఆమెకి మణిరత్నం సినిమాలో ఛాన్స్ రావడం ఇది కొత్తేమీ కాదు. `రావణ్`లో ప్రియమణి చేసిన పాత్ర కోసం మొదట నయనతారనే సంప్రదించారట. కానీ నయన్ అప్పట్లో ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట. దీంతో ప్రియమణిని ఎంచుకొన్నారు. రెండోసారి మాత్రం మణితో చేయాలని నయన్ ఫిక్సయిపోయింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి `కోమలి` అనే పేరు పరిశీలనలో ఉంది.
Advertisement
CJ Advs