చిటికేస్తూ వస్తున్నాడు మహేష్
మహేష్ సందడి షురూ అవుతోంది. `బాహుబలి` కబుర్లతోనే కాలక్షేపం చేస్తున్న ప్రేక్షకులందరూ ఇక తన `శ్రీమంతుడు` గురించి మాట్లాడుకొనేలా చేయబోతున్నాడు. ఈ నెల 18న జరగనున్న ఆడియో విడుదల వేడుకతోనే అందుకు ముహూర్తం పెట్టాడు. ఆడియోని పురస్కరించుకొని చిత్రబృందం మహేష్ స్టిల్స్‌ని విడుదల చేసింది. సోమవారం ఓ స్టైలిష్ స్టిల్ బయటికొచ్చింది. మంగళవారం మోషన్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇలా రోజుకో రకంగా సందడి చేస్తూ `శ్రీమంతుడు`తో మహేష్ తన హవా కొనసాగించబోతున్నాడు. సోమవారం విడుదల చేసిన లుక్‌లో మహేష్ అదుర్స్ అనిపించేలా ఉన్నాడు. రికార్డులన్నీ తిరగరాస్తా అన్నట్టుగా చిటికెలేస్తూ వస్తున్న ఆ స్టిల్ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ సైకిల్‌పై కాస్త మాసీగా అనిపించింది. ఇప్పుడు మాత్రం క్లాస్ లుక్‌తో అదరగొడుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బిజినెస్ మ్యాగ్నెట్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అటు క్లాస్‌గా కనిపిస్తూనే ఇటు మాస్‌ని అదరగొట్టేలా ఆయన నటించాడని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. `బాహుబలి` సాధించిన కొత్త రికార్డులు మహేష్‌కి సవాల్‌గా నిలవబోతున్నాయి. `శ్రీమంతుడు` బడ్జెట్టు, సినిమా స్థాయి వేరు అయినా... మహేష్ అభిమానులు మాత్రం కొత్త రికార్డులపై కాన్ఫిడెన్స్‌గా ఉన్నారు.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads