మురళి, సంగీత, కామేశ్వరావు ప్రధాన పాత్రల్లో నక్షత్రాస్ ప్రై లిమిటెడ్ బ్యానర్ పై శ్రవణ్ చక్రవర్తి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన షార్ట్ ఫిలిం 'మూకీ'. ఈ చిత్రాన్ని సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వేణు, ఆశిష్, కామేశ్వరావు, శ్రవణ్ చక్రవర్తి, హీరో మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా..
వేణు మాట్లాడుతూ "నేను ఇప్పటివరకు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసాను. ఈ సినిమా టెక్నికల్ గా చాలా బావుంది. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ చాలా ముఖ్యమైంది. వాయిస్ వల్లే సినిమా బాగా వచ్చింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచింది" అని చెప్పారు.
కామేశ్వరావు మాట్లాడుతూ "ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించమని శ్రవణ్ నన్ను అడగగానే అంగీకరించాను. స్క్రిప్ట్ చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చెప్పినట్లుగానే ఓ మంచి చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి ఔట్ పుట్ వచ్చింది. శ్రవణ్ లాంటి వాళ్ళు ఇండస్ట్రీకు చాలా అవసరం. తను మంచి డైరెక్టర్ గా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని చెప్పారు.
డైరెక్టర్ శ్రవణ్ చక్రవర్తి మాట్లాడుతూ "ఓ మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఈ 'మూకీ' చిత్రాన్ని తెరకెక్కించాం. మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు నాకు సహకరించిన టెక్నీషియన్స్ కు ధన్యవాదాలు" అని చెప్పారు.
ఈ చిత్రానికి కెమెరా: హరీష్, మ్యూజిక్: ప్రవీణ్ , ఎడిటర్: మురళి కృష్ణ, మేనేజర్: కళ్యాన్, డి.టి.ఎస్: యాతి రాజ్.