తుషార్ గౌతమ్, హర్ష కుమార్, వెర్టికా గుప్తా ప్రధాన పాత్రల్లో దీపక్ బల్ దేవ్ దర్శకత్వంలో గ్లిట్టర్స్ ఫిలిం అకాడమీ నిర్మిస్తున్న సినిమా 'బమ్ డమ్'. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ సోమవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోదండరామిరెడ్డి ట్రైలర్ ను, పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా..
కోదండరామిరెడ్డి మాట్లాడుతూ "దీపక్ మంచి టాలెంటెడ్ నటీనటులను ఇండస్ట్రీకు అందించాలనే ఉద్దేశ్యంతో గ్లిట్టర్స్ అకాడమీను స్థాపించారు. ఆయన మొదటిసారిగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ట్రైలర్ చాలా క్వాలిటీ గా ఉంది. సినిమా మంచి సక్సెస్ ను సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ "అకాడమీ ద్వారా స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇస్తూ సినిమాలను కూడా నిర్మించడం సంతోషకరమైన విషయం. ట్రైలర్ చక్కగా ఉంది. సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాను" అని చెప్పారు.
దర్శకుడు దీపక్ బల్ దేవ్ మాట్లాడుతూ "చిన్నప్పట్నుంచీ పెద్ద హీరో కావాలని కలలుగంటూ పెరిగిన ఓ యువకుడు అనుకోని పరిస్థితుల ప్రభావం వలన రీల్ హీరో అవ్వడానికి బదులుగా రియల్ హీరోగా ఎలా ఎదిగాడన్నదే ఈ సినిమా. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలుగు మరియు హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చిన ఈ చిత్రాన్ని అతి త్వరలో హిందీ మరియు తెలుగు భాషల్లో భారతదేశమంతటా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వీరశంకర్, శివనాగేశ్వరావు, అజయ్ బూయాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి ఎడిటింగ్: కె.ఆర్.స్వామి, కెమెరా: అనిల్ కుమార్ - శంకర్ కోట, సంగీతం: కె.సి.మౌళి, నిర్మాణం: గ్లిట్టర్స్ ఫిలిం అకాడమీ, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: దీపక్ బల్ దేవ్.
Advertisement
CJ Advs