Advertisement
Google Ads BL

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘దానవీర శూరకర్ణ’..!


        
స్వర్గీయ నందమూరి జానకిరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం ‘దానవీర శూరకర్ణ’. జె.వి.ఆర్‌ దర్శకుడు. శ్రీసాయి జగపతి పిక్చర్స్‌, సంతోష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు  సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె.బాలరాజు, చలసాని వెంకటేశ్వరరావు నిర్మాతలు. చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. జూలై నెలాఖరులో లేదా ఆగస్ట్‌ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకుల  ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు  చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ... ‘బాల రామాయణం’ తర్వాత అంతా బాల నటీనటుతో వస్తున్న చిత్రమిది. స్వర్గీయ జానకీరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ కృష్ణుడిగా, రెండో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా నటిస్తున్నారు. ఇద్దరూ కూడా అద్భుతంగా యాక్ట్‌ చేశారు. నటనలో తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారు. వారితోపాటు మిగతా బాల నటులంతా కూడా అద్భుతంగా నటించారు. దర్శకుడు జెవిఆర్‌ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో బాగా తెరకెక్కించారు. కౌసల్య  సంగీతం సారథ్యంలో పాటలకు చక్కని స్పందన వస్తోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లు, గ్రాఫిక్స్‌ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఫస్ట్‌ కాపీ రెడీ అయింది. ఇటీవల సెన్సార్‌  కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్‌ ‘యు’ సర్టిఫికెట్‌ పొందింది. జూలై చివరివారంలో లేదా ఆగస్ట్‌ మొదటివారంలో సినిమాను విడుదల  చేసేందుకు సన్నాహాలు  చేస్తున్నాం’’ అని తెలిపారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs