చెర్రీ అమర్‌నాథ్ యాత్ర
రామ్‌చరణ్ అమర్‌నాథ్ యాత్ర చేశాడు. సముద్రపు మట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ని శుక్రవారం సందర్శించాడు చరణ్. శ్రీనువైట్ల సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్న ఆయన ఉన్నట్టుండి అమర్‌నాథ్ యాత్ర చేయాలని ఎందుకనుకొన్నాడు అంటారా? అందుకు బలమైన కారణమే ఉందట. చరణ్ అమర్‌నాథ్ యాత్రకి వెళ్లాలనేది ఆయన తల్లి సురేఖ కోరికట. ఆమె కోరిక మేరకే చరణ్ అక్కడికి వెళ్లి దేవుడని దర్శించుకొన్నాడు. ఆ యాత్ర ఒక అందమైన అనుభవం అని ఫేస్‌బుక్‌లో తన ఫొటోల్ని పోస్ట్ చేశాడు చెర్రీ. హిందీలో `జంజీర్` సినిమా చేయడంతో ఉత్తర భారతీయులందరికీ చరణ్ పరిచయమే. అమర్‌నాథ్ యాత్రలో చరణ్ చూసి పోలీసులు, భక్తులు గుర్తుపట్టేసినట్టు ఫొటోల్లో కనిపిస్తోంది. అన్నట్టు గోదావరి పుష్కరాల్ని పురస్కరించుకొని చరణ్ తన సొంత విమానాల్ని నడపబోతున్నాడు. చరణ్ సొంతంగా విమానయాన సంస్థని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అందులో చెర్రీ భార్య ఉపాసన కూడా పార్టనరే. మరి అమర్‌నాథ్ యాత్రకి తన సొంత విమానంలోనే వెళ్లాడో లేక వేరే విమానంలో వెళ్లాడో!
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads