బ్యాంకాక్‌లో పూరి ఏం చేస్తున్నాడు?!
కొత్త సినిమాకి కథ రాసుకోవాలంటే చాలు. వెంటనే పట్టాయా ఫ్లైట్ ఎక్కేస్తాడు పూరి జగన్నాథ్. అక్కడ సముద్రపు ఒడ్డున కూర్చుని కథ రాసుకొంటాడు. నాలుగైదు రోజుల్లో పూర్తి స్క్రిప్టుతో మళ్లీ హైదరాబాద్ తిరిగొచ్చేస్తాడు. మొత్తంగా పట్టాయాని దర్శించుకోకపోతే ఆయన కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టలేడంతే. ఇప్పుడు కూడా పూరి అక్కడే ఉన్నాడు. పట్టాయాలో అందమైన సాయంత్రం... అంటూ తన గదినీ, చుట్టూ లొకేషన్‌నీ కెమెరాలో బంధించి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు పూరి. వరుణ్‌తేజ్‌తో `లోఫర్` సినిమాని ప్రకటించి ఇప్పుడు పూరి పట్టాయా వెళ్లిపోవడం ఏంటనేదే అసలు ప్రశ్న. వరుణ్‌తేజ్‌తో తీయనున్న సినిమాకి కథ రాసుకోవడం కోసమే ఆయన పట్టాయా వెళ్లాడా లేక వేరే కథ రాసుకోవడానికా అన్నది సందేహంగా మారింది. వరుణ్‌తేజ్‌తో తీయబోతున్న `లోఫర్` స్క్రిప్టును ఎప్పుడో రాసేసుకొన్నాడనీ, ఇప్పుడు పూరి పట్టాయా వెళ్లింది వేరే కథ కోసమే అని ఫిల్మ్‌నగర్ జనాలు చెబుతున్నారు. వేరే కథ అంటే చిరు 150 సినిమా కథే. చిరుకి ఫస్ట్ హాఫ్ కథ చెప్పి ఒప్పించిన పూరి ఇప్పుడు సెకండ్ హాఫ్ కథని, డైలాగ్ వర్షన్‌నీ రాసుకోవడానికే పట్టాయా వెళ్లినట్టు సమాచారం. అక్కడ్నుంచి రాగానే చిరుకి పూర్తి స్క్రిప్టు చెప్పేసి కొత్త సినిమా పనుల్ని మొదలుపెడతాడట. `లోఫర్` ఒక షెడ్యూల్ పూర్తి చేసి ఆ తర్వాత చిరు సినిమాకి కొబ్బరికాయ కొట్టేస్తాడని తెలుస్తోంది.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads