Advertisement
Google Ads BL

'ప్రమాదం' మూవీ సక్సెస్ మీట్..!


సంబిత్, మౌసుమి, స్నేహ ప్రధాన పాత్రల్లో అర్ర మూవీస్ సమర్పణలో తపస్ జేనా, ప్రదీప్ దాష్ దర్శకత్వంలో ప్రదీప్ కుమార్ అర్ర నిర్మించిన సినిమా 'ప్రమాదం'. చావు 100% అనేది ఉపశీర్షిక. జూన్ 26 న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబద్ లోని సక్సే మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

హీరో కె.కె మాట్లాడుతూ "ఈ సినిమాలో నేనొక భిన్నమైన పాత్రలో నటించాను. ఫుల్ లెంగ్థ్ హారర్ మూవీ ఇది. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించారు. సినిమా కోసం టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేసారు. ఈ చిత్రాన్ని విడుదల చేసిన శ్రేయాస్ మీడియా వారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

ప్రదీప్ కుమార్ అర్ర మాట్లాడుతూ "రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్ల పరంగా చాలా సంతోషంగా ఉన్నాం. హారర్ సినిమా లవర్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కి నా థాంక్స్" అని చెప్పారు.

హీరోయిన్ ఎలి మాట్లాడుతూ "తెలుగులో నా మొదటి చిత్రమిది. ఈ సినిమాతో మంచి ఎక్స్ పీరియన్స్ కలిగింది. అందరు చాలా కష్టపడి పని చేసారు. మేము అనుకున్నట్లుగానే మంచి రిజల్ట్ వచ్చింది. ఓ మంచి చిత్రంలో నన్ను భాగం చేసిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs