Advertisement
Google Ads BL

'బస్తీ' మూవీ విడుదలకు సిద్ధం..!


శ్రేయాన్, ప్రగతి జంటగా వజ్మన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వాసు మంతెన దర్శకత్వం వహిస్తూ.. నిర్మించిన చిత్రం 'బస్తీ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో..

Advertisement
CJ Advs

వాసు మంతెన మాట్లాడుతూ "ఇదొక యాక్షన్ లవ్ స్టొరీ. ఒక బస్తీలో రెండు వర్గాల మధ్యన ఓ సంఘటన జరుగుతుంది. అక్కడ కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో హీరో, హీరోయిన్ ఇద్దరు ప్రేమలో పడతారు. అనుకోకుండా హీరోకు ఓ సమస్య ఎదురవుతుంది. ఆ సమస్యను చేదించి తన ప్రేమను ఎలా గెలుచుకుంటాడనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నాకు మొదటినుండి రకరకాల వ్యాపారాలు చేయడమంటే ఇష్టం. అందులో భాగంగానే ఓ సినిమాను నిర్మించాలనుకున్నాను. నాలో ఉన్న క్రియేటివ్ ఎక్స్ ప్రెషన్ ఈ బస్తీ. నాకు సెల్ఫ్ స్టడీ చాలా ఎక్కువ. ఏ వ్యాపారం మొదలు పెట్టినా ముందు దానిపై అవగాహన పెంచుకుంటాను. ఈ చిత్రం కోసం గౌతంరాజు, జయసుధ గారు ఎంతగానో ప్రోత్సహించారు. శ్రేయాన్ బాగా నటించాడు. ముఖ్యంగా ప్రగతి ఈ సినిమా కోసం చాలా కష్టపడింది. 36 రోజులలో షూటింగ్ పూర్తిచేసుకున్నాం. సినిమాలో 5 పాటలుంటాయి. జూలై 3న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం" అని చెప్పారు.

హీరో శ్రేయాన్ మాట్లాడుతూ "నిజాయితీతో కూడిన ఓ లవ్ స్టొరీ ఇది. ఈ సినిమాలో మొదట డబ్బింగ్ నేనే  చెప్పిన సినిమా డిలే అవకూడదనే ఉద్దేశ్యంతో వేరే వాళ్ళతో చెప్పించాం. జూలై 3న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను" అని చెప్పారు.

హీరోయిన్ ప్రగతి మాట్లాడుతూ "శ్రేయాన్ మంచి సపోర్టివ్ కో యాక్టర్. తనతో వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన వాసు మంతెన గారికి నా థాంక్స్ " అని చెప్పారు.

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs