దిష్టి తగులుతుందని చెప్పడం లేదుకానీ... రామ్ చరణ్ సినిమా వెనక బోలెడన్ని విశేషాలున్నాయంటున్నాడు రచయిత కోన వెంకట్. రామ్‌చరణ్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి కోన వెంకట్ రచయితగా పనిచేస్తున్నాడు. ఒకప్పుడు కలిసి పనిచేసిన శ్రీనువైట్ల, కోన `బాద్‌షా` తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. మనస్పర్థలు రావడంతో ఎవరి కుంపటి వారు పెట్టుకొన్నారు. అయితే రామ్‌చరణ్ చొరవతో మళ్లీ ఇద్దరూ కలిశారు. చెర్రీ నటిస్తున్న 9వ చిత్రానికి కలిసి పనిచేస్తున్నారు. ఆ చిత్రం గురించి కోన ట్విట్టర్‌లో స్పందించాడు. `రామ్‌చరణ్ సినిమా వెనక చాలా మంచి సంగతులున్నాయి. దిష్టి తగులుతుందని వాటి గురించి చెప్పడం లేదు. అయితే వాటన్నిటి గురించి సినిమానే మాట్లాడుతుంద`ని కోన ట్వీట్ చేశాడు. చెర్రీ, రకుల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి `మై నేమ్ ఈజ్ రాజు` అనే పేరు ప్రచారంలో ఉంది. చరణ్ సినిమాలో ఫైటర్‌గా, పోలీసుగా రెండు రకాల పాత్రల్లో సందడి చేస్తాడని సమాచారం. అక్టోబరులోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Advertisement
CJ Advs