విద్యకి 18కోట్ల రెమ్యునరేషన్..!
సరైన కథ పడితే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా స్టార్ హీరోల సినిమాల రేంజ్‌లో వసూళ్లు సాధిస్తాయని విద్యాబాలన్ `డర్టీ పిక్చర్`తో నిరూపించింది. అప్పట్నుంచి బాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ కథలకి ఊపొచ్చింది. ఆ మాటకొస్తే ఇటీవల హిందీ చిత్రసీమలో వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న సినిమాల జాబితాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయి. విద్యాబాలనే డర్టీపిక్చర్ తర్వాత కహానీతో మళ్లీ బాక్సాఫీసు దగ్గర వసూళ్ల హోరెత్తించింది. కంగన రనౌత్ కూడా అదే దారిలో అదరగొట్టడం మొదలెట్టింది. తను వెడ్స్ మను, క్వీన్, తను వెడ్స్ మను రిటీర్న్స్... తదితర చిత్రాలతో కంగన బాక్సాఫీసుకు కొత్త ఊపుని తీసుకొచ్చింది. అందుకే ఇప్పుడు బాలీవుడ్ హీరోల కంటే హీరోయిన్ ఓరియెంటెడ్ కథలకే ప్రాధాన్యమిస్తూ సినిమాలు చేస్తోంది. తాజాగా విద్యాబాలన్‌తో ఓ లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ చేసేందుకు అగ్ర నిర్మాణ సంస్థ ఒకటి ఆమెకి రూ.18 కోట్లు పారితోషికం ఇచ్చేందుకు అంగీకరించిందట. ఆ చిత్రం ఇందిరాగాంధీ జీవిత కథ ఆధారంగా చేసుకొని తెరకెక్కబోతోందని సమాచారం. దీన్నిబట్టి విద్య అత్యధిక పారితోషికం అందుకొంటున్న కథానాయికగా రికార్డులకెక్కిందని బాలీవుడ్ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి.
Advertisement
CJ Advs