Advertisement
Google Ads BL

త్వరలో యువతీ యువకుల ‘నిన్నే కోరుకుంటా’!


>శుభకరి క్రియేషన్స్‌ పతాకంపై విజయ్‌భాస్కర్‌, వివేక్‌, ఆనంద్‌, పూజిత మొదలగువారు ప్రధాన తారాగణంగా గణమురళి దర్శకత్వంలో నిర్మాత మరిపి విద్యాసాగర్‌ నిర్మిస్తున్న చిత్రం ‘నిన్నే కోరుకుంటా’. ప్రస్తుతం ఈ చిత్రం ఎడిటింగ్‌లతో పాటు డబ్బింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 

Advertisement
CJ Advs
>ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మరిపి విద్యాసాగర్‌(వినయ్‌) మాట్లాడుతూ..‘‘ఇదొక రొమాంటిక్‌ కామెడీ మూవీ. సినిమా అంతా ప్రేక్షకుల్ని ఫుల్‌గా నవ్విస్తుంది. నేటి యువతీ యువకుల మనస్థత్వాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ సినిమాలో చేస్తున్న ఆర్టిస్ట్‌లందరూ సినిమాకోసం ఎంతగానో సహకరించారు. దర్శకుడు గణమురళి..చెప్పినదానికంటే గొప్పగా చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుతం ఎడిటింగ్‌, డబ్బింగ్‌ పూర్తయ్యాయి. త్వరలో ఆడియో విడుదల చేసి, ఆ వెనువెంటనే సినిమాని కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము..’ అన్నారు.

>విజయ్‌భాస్కర్‌, వివేక్‌, ఆనంద్‌, పూజిత, వైజాగ్‌ ప్రసాద్‌, పూర్ణిమ, సారిక, ప్రదీప్‌, సత్యం రాజేష్‌, సుమన్‌శెట్టి, కొండవలస, సంజన, అంబటి శ్రీను, ప్రసాద్‌ చౌదరి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి మాటలు: సాహు, ప్రకాష్‌, మాధవ్‌, పాటలు: పోతుల రవికిరణ్‌, కులశేఖర్‌, సంగీతం: ప్రణవ్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, 

>నిర్మాత: మరిపి విద్యాసాగర్‌(వినయ్‌)

>కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గణమురళి

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs