అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన ఓ మరుపురాని చిత్రం `మనం`. మూడు తరాల కథానాయకులు కలిసి నటించిన ఈచిత్రం అటు ప్రేక్షకుల్ని, ఇటు విమర్శకుల్ని ఎంతగానో మెప్పించింది. ఇప్పుడు అవార్డుల్లోనూ సత్తా చాటుతోంది. `మనం` చిత్రానికి ఏకంగా ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రంతో పాటు, ఉత్తమ సంగీత దర్శకుడిగా అనూప్‌రూబెన్స్‌కీ, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్‌కీ, ఉత్తమ కెమెరామెన్‌గా పీ.యస్.వినోద్‌కీ, ఉత్తమ దర్శకుడిగా విక్రమ్ కుమార్‌కీ పురస్కరాలు లభించాయి. అక్కినేని నాగార్జున హాజరై ఉత్తమ చిత్రంగా `మనం`కి లభించిన ఫిల్మ్‌ఫేర్‌ని అందుకొన్నాడు. ఈ సందర్భంగా ఆయన వేడుకలో భావోద్వేగంతో మాట్లాడారు. ఒక మంచి చిత్రానికి అవార్డులు లభించడం పట్ల తెలుగు ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
CJ Advs