ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ నటుడు అవార్డు కోసం భారీగా పోటీ కనిపించింది. నాగార్జున, వెంకటేష్, మహేష్‌లాంటి సీనియర్లు పోటీలో నిలిచారు. అయితే ఆ అవార్డు చివరికి అల్లు అర్జున్ సొంతమైంది. `రేసుగుర్రం`లో నటనకుగానూ ఆయన ఈ అవార్డుని తీసుకొన్నారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి కృతజ్జతలు చెబుతూ అవార్డును ఏఎన్నార్‌కి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు అల్లు అర్జున్. లెజెండ్రీ యాక్టర్ ఏఎన్నార్‌కి నివాళిగా నాకు దక్కిన ఫిల్మ్‌ఫేర్‌ని అంకితం చేస్తున్నా అని ట్వీట్ చేశాడు అల్లు అర్జున్. ఏఎన్నార్ నటించిన చివరి చిత్రం `మనం`కి 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. దీంతో అందరూ మరోసారి ఏఎన్నార్‌ని తలచుకొంటూ నివాళులర్పిస్తున్నారు. ఇప్పుడు బన్నీ కూడా తన పురస్కారాన్ని ఆయనకే అంకితం ఇవ్వడం విశేషం. `మనం`, `రేసుగుర్రం` చిత్రబృందాలు అవార్డు రావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ట్విట్టర్‌లో ఆ రెండు చిత్రాల గురించి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement
CJ Advs