Advertisement
Google Ads BL

జనని క్రియేషన్స్‌ ‘కౌసల్య’ షూటింగ్‌ పూర్తి..!


జనని క్రియేషన్స్‌ పతాకంపై శరత్‌ కళ్యాణ్‌, అభిషేక్‌ రంజన్‌, అజయ్‌ దీవా, విక్రమ్‌, శ్వేతా ఖడే ముఖ్య తారాగణంగా మధుసూదన్‌ సామల, రమేష్‌ బాబు పెంట సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కౌసల్య’. ఈ చిత్రం ద్వారా వర్ధమాన సంగీత దర్శకుడు మహేష్‌ ఆపాల దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌  పూర్తిచేసుకుని త్వరలో ఆడియో విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన రమేష్‌బాబు పెంట మాట్లాడుతూ...‘‘కర్ణాటకలోని కూర్గ్‌ ప్రాంతంలో గల అందమైన ప్రదేశాలలో ఒక పాటతో పాటు కొన్ని సన్నివేశాలు వారం రోజుల పాటు చిత్రీకరించాము. అలాగే హైదరాబాద్‌ సారథి స్టూడియోలో భారీ సెట్‌ వేసి ఐటమ్‌ సాంగ్‌తో పాటు పోరాట దృశ్యాలు చిత్రీకరించాము. దీంతో షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జులై మొదటి వారంలో  ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా పాటలు మార్కెట్‌లోకి విడుదల చేసి ఆగస్టు చివరి వారంలో సినిమా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నామని’’ అన్నారు.

దర్శకుడు మహేష్‌ ఆపాల మాట్లాడుతూ...‘‘ కొన్ని రియల్‌ ఇన్సిడెంట్స్‌ బేస్‌ చేసుకుని రూపొందిస్తున్న చిత్రమిది. ప్రతి ఒక్కరూ ఏదొ ఒక సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఎదర్కొనే ఉంటారు. అన్ని వర్గాల ఆడియన్స్‌ థ్రిల్లయ్యేలా ప్రతి సన్నివేశముంటుంది.  ఈ చిత్రం ద్వారా నలుగురు హీరోలు, ఒక హీరోయిన్‌ని పరిచయం చేస్తున్నామని’’ తెలిపారు.

స్నేహ,జబర్‌దస్త్‌ఫణి, శ్రీధర్‌రాజ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు:శ్రీనివాస్‌ పూడూరి కెమేరా:బాపూజీ, ఎడిటింగ్‌:జానకిరామ్‌, పీఆర్వో: కూమారస్వామి(బాక్సాఫీస్‌), కొరియోగ్రఫీ: రేలంగి కిరణ్‌, ఇ.వినయ్‌, ఆర్ట్‌:విజయ్‌ క్రిష్ణ, పాటలు:సురేష్‌ గంగుల,  స్క్రీన్‌ప్లే: కె.చంద్రశేఖర్‌ సహనిర్మాతలు:రవీందర్‌రెడ్డి చింతకుంట,రవి గుమ్మడిపూడి, నిర్మాతలు: మధుసూదన్‌ సామల, రమేష్‌ బాబు పెంట, కథ-సంగీతం- దర్శకత్వం: మహేష్‌ ఆపాల 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs