Advertisement

‘బుల్లెట్‌రాణి’ రఫ్ ఆడిస్తుంది..!


సెక్సీ సైరన్‌ నిషా కొఠారి పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘బుల్లెట్‌రాణి’. తెలుగు`కన్నడ భాషల్లో సైమల్టేనియస్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువ ప్రతిభాశాలి సాజిద్‌ ఖురేషి దర్శకత్వంలో ‘ఫోకస్‌ ఆన్‌ పిక్చర్స్‌’ పతాకంపై ఎం.ఎస్‌.యూసుఫ్‌ నిర్మిస్తున్నారు. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం ట్రయిలర్‌ను ఇటీవల విడుదల చేసారు. గున్వంత్‌సేన్‌ సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్‌, కరుణాకర్‌ అడిగర్ల సాహిత్యం సమకూర్చారు.  

Advertisement

అవుట్‌ అంట్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘బుల్లెట్‌రాణి’ గురించి చిత్ర దర్శకుడు సాజిద్‌ ఖురేషి మాట్లాడుతూ.. ‘గ్లామర్‌`యాక్షన్‌`కామెడి’ల కలగలుపుగా తెరకెక్కుతున్న హీరోయిన్‌ ఓరియంటెడ్‌ ఫిలిం ఇది. తెలుగుతోపాటు, కన్నడలోనూ ఏకకాలంలో రూపొందుతున్న ఈ మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి కావచ్చాయి. త్వరలోనే పాటలను విడుదల చేయనున్నాం. ఇప్పుడు ట్రయిలర్‌ను రిలీజ్‌ చేస్తున్నాం. నిషా కొఠారి గ్లామర్‌, మరియు ఆమె పెర్‌ఫార్మెన్స్‌ ‘బుల్లెట్‌రాణి’కి స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌గా నిలుస్తాయి. డేర్‌ డెవిల్‌ లేడీ పోలీసాఫీసర్‌గా.. యాంటీ సోషల్‌ ఎలిమెంట్స్‌పై ఆమె విరుచుకుపడే తీరు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది. గున్వంత్‌సేన్‌ సమకూర్చిన సంగీతం, రీ-రికార్డింగ్‌ ‘బుల్లెట్‌రాణి’కి ఆయువుపుట్టుగా నిలుస్తాయి’ అన్నారు.

నిర్మాత ఎం.ఎస్‌.యూసుఫ్‌ మాట్లాడుతూ.. ‘మా డైరెక్టర్‌ సాజిద్‌ ఖురేషి ‘బుల్లెట్‌రాణి’ చిత్రాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రం విడుదలయ్యాక దర్శకుడిగా ఆయన పేరు మారుమ్రోగడం ఖాయం. అలాగే.. నిషా కొఠారికి ఈ చిత్రం టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుంది. అందరి ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్స్‌ నుంచి మా డైరెక్టర్‌ సాజిద్‌ చాలా మంచి అవుట్‌పుట్‌ తీసుకున్నారు’ అన్నారు.

ఆశిష్‌ విద్యార్ధి, రవి కాలె (దృశ్యం ఫేం) షఫి, తాగుబోతు రమేష్‌, అవినాష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌: వి.సురేష్‌కుమార్‌, కాస్ట్యూమ్స్‌: వెంకట్‌, ఆర్ట్‌: నాగు, యాక్షన్‌: థ్రిల్లర్‌ మంజు`డ్రాగన్‌ ప్రకాష్‌, సాంగ్స్‌: చంద్రబోస్‌`కరుణాకర్‌ అడిగర్ల, మ్యూజిక్‌: గున్వంత్‌సేన్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: గోవింద్‌ యాదవ్‌, నిర్మాత: ఎం.ఎస్‌.యూసుఫ్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సాజిద్‌ ఖురేషి!!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement