సురభి మరో ఛాన్స్ కొట్టింది..!
ఇటీవల కాలంలో హీరోయిన్లకు ఫ్లాపులు పడ్డా అవకాశాలొస్తున్నాయి. ఆమధ్య ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన `బీరువా`లో సందీప్ కిషన్ సరసన నటించింది సురభి. ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా సురభికి మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఆర్జీవీ దర్శకత్వంలో `అటాక్` అనే సినిమా చేసింది. ఆ చిత్రం రేపోమాపో విడుదల కాబోతోంది.ఇంతలోనే ఆమె సైలెంటుగా మరో అవకాశాన్ని కూడా సొంతం చేసుకొంది. శర్వానంద్ సరసన నటిస్తోంది. శర్వా కథానాయకుడిగా `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అందులో కథానాయికగా సురభిని ఎంచుకొన్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి `ఎక్స్‌ప్రెస్ రాజా` అనే పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads