రామోజీ ఫిల్మ్‌సిటీ చాలా పెద్దది. గిన్నిస్ బుక్కులోకి కూడా ఎక్కింది. ఎన్నో హాలీవుడ్ చిత్రాలు కూడా అక్కడ షూటింగ్ జరుపుకొని వెళ్లాయి. అయితే జక్కన్న వాడుకొన్నట్టుగా ఫిల్మ్‌సిటీని ఇప్పటిదాకా ఎవ్వరూ వాడుకోలేదని అర్థమవుతోంది. సినిమా షూటింగ్ అంటే మామూలుగా ఏదో ఒక ఫ్లోర్‌లోనో, రెండు ఫ్లోర్లలోనో జరుపుతుంటారు. ఔట్ డోర్ అంటే ఒక రెండు మూడు ఎకరాల్లో సెట్లు వేస్తుంటారు. కానీ రాజమౌళి మాత్రం బాహుబలి కోసం ఫిల్మ్‌సిటీలో మొత్తం 110 ఎకరాల్ని వాడుకొన్నాడట. ఆ విషయాన్ని ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
రామోజీ ఫిల్మ్‌సిటీ లేకపోతే మేం సినిమా చేసేవాళ్లమే కాదని సెలవిచ్చాడు జక్కన్న. సినిమాకోసం అక్కడ 20 ఎకరాల జొన్నతోట కూడా పెంచారట. ఇంతకీ ఆ జొన్నతోటతో రాజమౌళికి ఏం పని అన్నదే ఆసక్తికరం. అక్కడ చిత్రీకరణ గురించి ఆయన మాట్లాడుతూ ‘‘బాహుబలి కోసం రాజదర్బార్ సెట్టు వేశాం. అది చాలా పెద్దది. అందులోనే పిరమిడ్‌లాంటి ఆకారంతో 40 అడుగుల సెట్టు ఉంటుంది. దాన్నుంచి ఎక్కి చూస్తే చుట్టూ మా సినిమా పనులే జరుగుతున్నాయి. లెక్క పెడితే 110 ఎకరాల్ని ఆక్రమించుకొన్నామని అర్థమైంది. ఇలా ప్రపంచంలో వేరెక్కడా చిత్రీకరణ చేయలేమని ఆ క్షణంలోనే అర్థమైంది’’ అన్నాడు రాజమౌళి. మహిష్మతి సంస్కృతినీ, అప్పట్లో జనం పండిరచే పంటల్ని గుర్తు చేయడానికే రాజమౌళి జొన్నతోట వేయించాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అందులోనే ఓ పాటని తెరకెక్కించారని సమాచారం.
Advertisement
CJ Advs