Advertisement
Google Ads BL

'బస్తీ' ఆడియో విడుదల..!


జయసుధ తనయుడు శ్రేయాన్ హీరోగా, ప్రగతి హీరోయిన్ గా వజ్మన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వాసు మంతెన దర్శకత్వం వహిస్తూ.. నిర్మించిన చిత్రం 'బస్తీ'. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లోని శిల్పకలావేదిక లో పలువురు సినీ, రాజకీయనాయకుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ థియేట్రికల్ ట్రైలర్ ను, బిగ్ సిడిను ఆవిష్కరించి తొలి ప్రతిమను దర్శకరత్న దాసరి నారాయణరావు కు అందించారు. ఈ సందర్భంగా..

Advertisement
CJ Advs

కె.సి.ఆర్ మాట్లాడుతూ "జయసుధ గారి మీద ఉన్న అభిమానంతో, వాసు మంతెన పై ఉన్న వాత్సల్యంతో నేను ఈ కార్యక్రమానికి విచ్చేసాను. శ్రేయాన్ ను చూస్తుంటే తెలుగు అమితాబచ్చన్ లాగా ఉన్నాడు. తనకు మంచి భవిష్యత్తు ఉండాలి. ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలి. ఓ అవార్డు కార్యక్రమం కోసం అమితాబ్ గారు హైదరాబాద్ వచ్చినపుడు హైదరాబాద్ లోనే ఎక్కువగా షూటింగ్స్ జరుగుతున్నాయి. బొంబాయి కంటే మహానగరంగా హైదరాబాద్ ను డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై నేను ఇండస్ట్రీకు చెందిన కొందరి పెద్ద వాళ్ళతో మాట్లాడాను. తెలుగు పరిశ్రమను బాగుచేయాలనుకుంటున్నాం. కాని రాష్ట్రం ఇప్పుడే కొత్తగా ఏర్పడింది. కొన్ని సర్దుబాట్లు ఉన్నాయి. ప్రజల అవసారాలేంటి..? ఎలాంటి ప్రణాళికలు సిద్దం చేయాలి..? అనే విషయాలను డిస్కస్ చేస్తున్నాం. మేము ప్రకటించిన పారిశ్రామిక విధానానికి మంచి స్పందన వస్తోంది. కరెంటు సమస్యలను అధిగమించాం. ప్రస్తుతం సినిమా రంగాన్ని విస్తరింపజేయడానికి వీలైనంత త్వరలోనే సమావేశాలను ఏర్పాటు చేయనున్నాం. కేబినేట్ సమావేశాలను నిర్వహించి స్టూడియోలను, ఫిలింనగర్ సొసైటీ లను వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించనున్నాం. ఫిలిం నగర్ లాంటి మరో ఫిలిం నగర్2 ను నిర్మించుకుందాం. యాక్టింగ్ కోసం ఎక్కడికో వెళ్లి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలా కాకుండా ఇక్కడే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ను స్థాపించుకుందాం. నామినల్ రేట్స్ కే కళాకారులకు ఇళ్ళ స్థలాలను ఇప్పించనున్నాం. తెలంగాణా కళాకారులు ఇప్పటివరకు సినిమాలకు దూరంగా ఉన్నారు. కాని ఇప్పుడు వారు కూడా సినిమాలను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరంలోనే నేను సినిమాలను చూసాను. ఇప్పుడు మరల శ్రేయాన్ సినిమాతో సినిమాలు చూడడం మొదలుపెడతాను" అని చెప్పారు.

దాసరి నారాయణరావు మాట్లాడుతూ "మొదటిసారి కెసిఆర్ గారు సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చి ఆడియో సిడిను విడుదల చేసారు. కళాకారులను ఎంత గౌరవించాలో తెలిసిన వ్యక్తి. జయసుధ 43 ఏళ్ళ కెరీర్ లో నేను చేసిన 27 సినిమాలో నటించింది. వాసు మంతెన ఒకసారి నన్ను కలిసాడు. ఆ పరిచయంలో తన క్రియేటివిటీ ఏంటో అర్ధమయ్యింది. తన దర్శకత్వంలో ఈ సినిమా బాగా వచ్చిందనుకుంటున్నాను. కొన్ని క్లిప్పింగ్స్ చూసాను. శ్రేయాన్ అధ్బుతంగా నటించాడు. వాసు కు ఉన్న గట్స్ కు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. సినిమా బస్తీ పాడైపోయింది. చిన్న నిర్మాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. బస్తీ లను బాగు చేస్తున్న కెసిఆర్ గారే సినిమా ఇండస్ట్రీను బాగు చేయాలి" అని చెప్పారు.

మోహన్ బాబు మాట్లాడుతూ "పోరాటయోదుడు కెసిఆర్ మొదటిసారిగా చలన చిత్ర వేదికపైకి వచ్చారు. సినిమా పరిశ్రమ గర్వపడాల్సిన విషయం. ఆయన ఆలోచనలన్నీ నిజమైతే దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా నిలుస్తారు. నా చెల్లెలు జయసుధ కుమారుడు నటిస్తున్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి" అని చెప్పారు.

విజయనిర్మల మాట్లాడుతూ "పండంటి కాపురం సినిమాతో నరేష్ ను, జయసుధను పరిచయం చేసాం. ఆమెను ఆదరించినట్లే ప్రేక్షకులు శ్రేయాన్ ను కూడా ఆదరించాలి" అని చెప్పారు.

ఎన్.శంకర్ మాట్లాడుతూ "మొదటిసారి కెసిఆర్ గారు వచ్చిన ఆడియో ఫంక్షన్ ఇది. బస్తీలను బంగారు బస్తీలుగా మారుస్తున్న కెసిఆర్ గారు వచ్చిన ఈ బస్తీ కూడా బంగారు కిరీటమై మెరవాలి" అని చెప్పాలి.

లగడపాటి శ్రీదర్ మాట్లాడుతూ "శ్రేయాన్ కు 16 సంవత్సరాల వయస్సులోనే నేనొక స్క్రిప్ట్ చెప్పాను. కానీ అప్పుడు తను నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ లో ఉన్నాడు. ఇప్పుడు వాసు డైరెక్షన్ లో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ట్రైలర్, పోస్టర్స్ చూస్తుంటే చాలా బాగా డైరెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. క్వాలిటీ బావుంది. మొదటిసారి డైరెక్షన్ చేసినట్లుగా అనిపించలేదు" అని చెప్పారు.

జయసుధ మాట్లాడుతూ "నా కొడుకు శ్రేయాన్ మొదటిసారిగా హీరోగా నటిస్తున్నాడు. తనొక స్పోర్ట్స్ పర్సన్.  సినిమాలలోకి వస్తాడనుకోలేదు. సినిమా కథ చాలా సింపుల్ గా ఉండాలనుకున్నాం. మేము అనుకున్నట్లుగానే వాసు మంచి స్టొరీ ఇచ్చారు" అని చెప్పారు.

వాసు మంతెన మాట్లాడుతూ "నాకు ఇదొక మంచి మూమెంట్. నేను ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదు. జయసుధ గారు నన్ను నమ్మి ఈ ఛాన్స్ ఇచ్చారు. సినిమా ఫ్రెష్ ఫీల్ ను కలిగిస్తుంది" అని అన్నారు.

శ్రేయాన్ మాట్లాడుతూ "ఇది నా ఫస్ట్ ఆడియో ఫంక్షన్. ప్రవీణ్ ఇమ్మడి మంచి మ్యూజిక్ ఇచ్చారు. నాకు మూడు సాంగ్స్ చాలా నచ్చాయి. జూలై 3న విడుదల కానుంది" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రగతి, శ్రీప్రియ, తమ్మారెడ్డి భరద్వాజ, రాజశేఖర్, జీవిత రాజశేఖర్, ప్రతాని రామకృష్ణ గౌడ్, మోహన్ బాబు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుబ్బిరామిరెడ్డి, శైలజా కిరణ్, దిల్ రాజు, రాఘవేంద్రరావు, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి డైలాగ్స్: ప్రభాకర్, మని రాయపు రెడ్డి, ఎడిటింగ్: గౌతంరాజు, మ్యూజిక్: ప్రవీణ్ ఇమ్మడి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: వి.కె.గుణశేఖర్, ప్రొడ్యూసర్: వజ్మన్ ప్రొడక్షన్స్, కథ-స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వాసు మంతెన  

 

 

 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs