మోడరన్ సినిమా పతాకంపై ఆదిత్యా ఓం స్వీయ దర్శకత్వంలో విజయ్ వర్మ పాకలపాటి నిర్మాణ నిర్వహణలో తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో రూపుదిద్దుకున్న చిత్రం 'ఫ్రెండ్ రిక్వెస్ట్'. ఈ చిత్రం టీజర్ ను ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో రుద్రపాటి పద్మరాజు, కె.వి.సత్యనారాయణ, రమేష్ ప్రసాద్ కలిసి లాంచ్ చేసారు. ఈ సందర్భంగా..
రుద్రపాటి పద్మరాజు మాట్లాడుతూ "ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. బాలీవుడ్ స్టైల్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమాటోగ్రఫీ బావుంది. రెండు భాషలలో సినిమా పెద్ద హిట్ అవుతుంది" అని చెప్పారు.
కె.వి.సత్యనారాయణ మాట్లాడుతూ "ఈ మధ్యకాలంలో హారర్ సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ చిత్రం కూడా అదే కోవలోకి రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.
దర్శకుడు ఆదిత్యా ఓం మాట్లాడుతూ "ఫేస్ బుక్ నేపధ్యంలో థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో నిర్మితమైన ఈ చిత్రం నేటి యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్ కి ఎంతో ప్రాదాన్యతనిచ్చి హై టెక్నికల్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. సాంకేతికపరంగా బాలీవుడ్ లో అగ్రస్థాయి హీరోలకు వాడే పరిజ్ఞానాన్ని ఈ చిత్రంలో ఉపయోగించాం" అని చెప్పారు.
విజయ్ వర్మ మాట్లాడుతూ "షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ లో భాగంగా ఎడిటింగ్, గ్రాఫిక్స్ పార్ట్ పూర్తయింది. జూలై లోగా రీరికార్డింగ్, డి.ఐ.తో సహా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని తదనంతరం విడుదలకు ప్రణాళిక చేస్తాం.
ఈ కార్యక్రమంలో రమేష్ ప్రసాద్, రాయపాటి సాంబశివరావు పాల్గొని చిత్ర బృందానికి విషెస్ తెలియజేసారు.
ఈ చిత్రంలో నటించిన తారాగణంతో పాటు సాంకేతిక నిపుణులు మరియు చిత్ర భాగస్వామ్యులు బామ్లా, అంబరీష్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: లవన్-వీరల్, కెమెరా: సిద్ధార్థ, ఎడిటింగ్: ప్రకాష్.