గుణశేఖర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘రుద్రమదేవి’ చిత్రం విడుదలకు అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు గుణశేఖర్. ఆ తర్వాత జూన్ 30కి రిలీజ్ చేస్తారన్న వార్తలు వినిపించాయి. ఇప్పుడు తాజా సమాచారం ఏమిటంటే ఈ సినిమాని జూలై 24న రిలీజ్ చేయబోతున్నారట. జూలై 10న ‘బాహుబలి’ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతుండడంతో ఆ సినిమా రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత ‘రుద్రమదేవి’ని రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాడు గుణశేఖర్. జూలై 17న రవితేజ ‘కిక్2’ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని కళ్యాణ్‌రామ్ ప్లాన్ చేశాడు. బాహుబలి వల్ల ఈ సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయింది. కిక్2ని జూలై 24 తర్వాతే చెయ్యాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. జూలై 24కి రుద్రమదేవి చిత్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చెయ్యాలని గుణశేఖర్ భావిస్తున్నాడట. బాహుబలి చిత్రం అందరి అంచనాలు మించిన విజయం సాధిస్తే ఆ డేట్‌కి కూడా రుద్రమదేవి రిలీజ్ అవడం డౌటేనని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.