Advertisement
Google Ads BL

అఖిల్‌ రియల్‌ ఫైట్స్‌ అదిరాయి.!


అఖిల్‌ అక్కినేని హీరోగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో నటిస్తున్న తొలి చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఇటీవల స్పెయిన్‌లోని ఎస్పానా సిటీలో చిత్రీకరించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ అద్భుతంగా వచ్చిందట. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌కి సంబంధించిన మేకింగ్‌ వీడియోను ఈరోజు మీడియాకు విడుదల చేశారు. అందులో అఖిల్‌ చేసిన రియల్‌ ఫైట్స్‌ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. టోటల్‌గా ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ చాలా అద్భుతంగా వచ్చిందని యూనిట్‌ చెప్తోంది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై హీరో నితిన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటివరకు 50 శాతం పూర్తయిందట. అఖిల్‌ సరసన సాయేషా సైగల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్‌, అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs