ఆలోచించకుండా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఛార్మిని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఆమెపై యాక్షన్ తీసుకోవాలని కోరుతూ నిర్మాతల మండలికి ఫిర్యాదు వరకు వెళ్లింది వ్యవహారం. రేపట్నుంచి ఇంకా ఈ వివాదం ఎన్నిమలుపులు తిరుగుతుందో అని ఫిల్మ్‌నగర్ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. నితిన్‌పై ఛార్మి చేసిన వ్యాఖ్యల దుమారమే ఇదంతా అన్న విషయం తెలిసిందే. ఛార్మి జోక్యం చేసుకొంటుందన్న విషయం నచ్చకే పూరి - నితిన్ సినిమా క్యాన్సిల్ అయ్యిందంటూ మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం గురించి ఛార్మి మాట్లాడుతూ ఆ సినిమా కేన్సిల్ కావడానికి నేను కారణం కాదనీ, నితిన్ దగ్గర డబ్బుల్లేకపోవడమే అని చెప్పింది. దీనిపై నితిన్, ఆయన తండ్రి సుధాకర్‌రెడ్డి అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
మా దగ్గర డబ్బుల్లేవన్నవిషయం ఆమెకి ఎలా తెలుసనీ, దీనివల్ల మార్కెట్‌లో మా ఇమేజ్ డేమేజ్ అయ్యిందనీ వాళ్లు సీరియస్ అవుతున్నారు. దీనిపై నితిన్, ఆయన తండ్రి కోర్టుకెక్కబోతున్నారని ప్రచారం సాగింది. అయితే ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఇటీవల నిర్మాతల మండలిని సంప్రదించినట్టు తెలిసింది. నిర్మాతలమైన మాపై లేనిపోని వ్యాఖ్యలు చేసిన ఛార్మిపై యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ మండలిని సంప్రదించారట నితిన్, సుధాకర్‌రెడ్డి. దీనిపై నిర్మాతల మండలి రేపోమాపో విచారణ జరపబోతోందన్నది సమాచారం. ఈ వ్యాఖ్యలు చేసిన మాట నిజమే అని ఛార్మి కూడా ఒప్పుకొంది. అందుకు ఆమె ట్విట్టర్‌లో సారీ కూడా చెప్పింది. మరి ఛార్మిపై మండలి ఎలాంటి యాక్షన్ తీసుకొంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
Advertisement
CJ Advs