మహేష్ బాబు, శ్రుతిహాసన్ జంటగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో వై.నవీన్, వై.రవిశంకర్, సి.వి.మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'శ్రీమంతుడు'. ఈ సినిమా విశేషాలు తెలిపేందుకు చిత్రబృందం గురువారం హైదరాబాద్ లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత వై.నవీన్ మాట్లాడుతూ "ఈ సినిమా షూటింగ్ ఈ నెల 27 వ తేదీతో ముగుస్తుంది. ఆడియో రిలీజ్ ను జూలై 18 న జరిపి, ఆగస్ట్ 7 వ తారీఖున చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆగస్ట్ 9న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ముందుగానే చిత్రాన్ని ప్రేక్షకులకు అందివ్వనున్నాం" అని చెప్పారు.
దర్శకుడు కొరటాలశివ మాట్లాడుతూ "ఈ చిత్రంలో పాటలు, సన్నివేశాల చిత్రీకరనంతా ఈ నెల 27తో కంప్లీట్ అవుతుంది. మొదట ఈ చిత్రాన్ని జూలై 17న విడుదల చేయాలనుకున్న మాట వాస్తవమే. కాని 'బాహుబలి' చిత్రం జూలై 10న విడుదలవుతున్నందుకు మా సినిమా రిలీజ్ డేట్ ను ఆగస్ట్ 7కు వాయిదా వేసుకున్నాం. రెండు పెద్ద సినిమాలు ఒకే సమయంలో రావడం మంచిది కాదనే ఉద్దేశ్యంతో బాహుబలి టీం, మా చిత్ర బృందం కలిసి తీసుకున్న నిర్ణయమిది. తద్వారా ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఇంకాస్త సమయం దొరుకుతుంది. ఈ చిత్రంలో మంచి ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. మహేష్ బాబు నడిపే సైకిల్ కు కూడా ఈ సినిమాలో మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమాలో ఓవర్ పంచ్ డైలాగ్స్ అలా కాకుండా పాత్రకు అవసరమైన మేరకే డైలాగ్స్ ఉంటాయి. దేవిశ్రీప్రసాద్ గారు స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అయ్యి మంచి మ్యూజిక్ అందించారు. మొదట నుండి మహేష్ గారు ప్రొడక్షన్ లో అసోసియేట్ అయ్యారు. నిర్మాతలు సినిమాల పట్ల మంచి ప్యాషన్ ఉన్న వ్యక్తులు. అనుకున్న బడ్జెట్ లో అనుకున్న సమయానికి సినిమా కంప్లీట్ చేసాం" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఏ.ఎస్.ప్రకాష్, రామజోగయ్య శాస్త్రి, వై.రవిశంకర్, సి.వి.మోహన్ తదితరు పాల్గొన్నారు.