సినీ ప్రేమికులు, సినీ ప్రముఖులు.. అందరి దృష్టీ ఇప్పుడు ‘బాహుబలి’పైనే వుంది. జూలై 10న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే మన కుర్ర హీరోలు మాత్రం టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకంటే తమ సినిమాలు కంప్లీట్ అయిపోయి రిలీజ్‌కి సిద్ధమవుతున్న టైమ్‌లో ‘బాహుబలి’ రిలీజ్ అవుతుండడంతో ఈనెలలోనే తమ సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. జూన్ 19న ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, ‘వినవయ్యా రామయ్యా’, ‘టిప్పు’, ‘బందూక్’ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. జూన్ 26న ‘రుద్రమదేవి’ చిత్రం రిలీజ్ అవుతుందని ప్రకటించినప్పటికీ ఆ సినిమా గురించి ఎలాంటి హడావిడి లేకపోవడంతో ‘టైగర్’, ‘జాదూగాడు’ వంటి సినిమాలు ఈ డేట్‌కి రిలీజ్‌కి రెడీ అయ్యాయి. తమ సినిమాల ఫలితాలు ఎలా వుంటాయనే ఆలోచన పక్కన పెట్టేసి ముందు సినిమాని రిలీజ్ చేసెయ్యాలన్న ఆలోచన ఆయా చిత్ర దర్శకనిర్మాతల మనసుల్లో వుంది. అందుకే ఒకే డేట్‌కి ఎక్కువ సినిమాల రిలీజ్‌లు వున్నప్పటికీ వెనకాడకుండా రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసేసుకున్నారు. ఎందుకంటే ‘బాహుబలి’ రిలీజ్ డేట్ తర్వాత ఓ రెండు మూడు వారాలు థియేటర్లు దొరకడం కష్టం కాబట్టి ఈ డెసిషన్‌కి వచ్చినట్టున్నారు. ‘బాహుబలి’ సినిమా ఎలా వుండబోతోందో, దాని రిజల్ట్ ఎలా వుంటుందో తెలీదుగానీ చిన్న హీరోలను, దర్శకనిర్మాతల్ని టెన్షన్ పెట్టిస్తోంది, పరుగులు తీయిస్తోంది.