Advertisement
Google Ads BL

'ఎలుకా మజాకా' మూవీ లోగో లాంచ్..!


డా బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, పావని ప్రధాన పాత్రల్లో నా ఫ్రెండ్స్ ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ళ నరసింహారావు, వద్దెంపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'ఎలుకా మజాకా'. ఈ చిత్ర లోగో ఆవిష్కరణ బుదవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో పలువురు సినిమా ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు లోగో ఆవిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో కోడిరామకృష్ణ, ధవళ సత్యం, సునీల్ కుమార్ రెడ్డి,  రామసత్యనారాయణ, రామ్ ప్రసాద్, మురళీమోహన్ రావు, రేలంగి నరసింహారావు, గంగోత్రి విశ్వనాథ్, బాబ్జి, బల్లేపల్లి మోహన్, సత్యనారాయణ రెడ్డి, నందం హరిచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాసరి నారాయణరావు మాట్లాడుతూ "ఈ కార్యక్రమం చూస్తుంటే మా కుటుంబమంతా కలిసి చేసుకుంటున్న పండుగలా ఉంది. అప్పుడప్పుడు నేను బాధ పడేవాడ్ని చాలా మంది దర్శకులు, నిర్మాతలు వాళ్ళ బిడ్డల్ని హీరోలుగా చేయడానికి ఎంత కష్టపడతారో.. నేను నా పిల్లల విషయంలో ఎందుకు అలా చేయలేదు అని. కాని ఇండస్ట్రీలో డెబ్బై శాతం మంది నా బిడ్డలే అని చెప్పుకోవడానికి చాలా సంతృప్తిగా ఫీల్ అవుతున్నాను. చాలా కాలంగా రేలంగి సినిమాలు తీయడం లేదు. ఆయనని సినిమాలు, మంచి కామెడీ సీరియల్స్ చేయమని కొందరు సంప్రదించారు. ఆయనే కాదు చాలా మంది సినిమాలు తీయడంలేదు. కొందరు సినీ ఇండస్ట్రీని కబ్జా చేసారు. ఆ స్వార్ధపరుల వల్ల చాలా మంది సినిమాలు తీయలేకపోతున్నారు. ఈ సినిమా నిర్మాతలు రేలంగితో సినిమా చేయాలని పట్టుబట్టారు. దాంతో రేలంగి నరసింహారావు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడానికి అంగీకరించారు. ఇదొక గమ్మత్తైన కథ. ఈ కథకు గ్రాఫిక్స్ కావాలి. సత్య ఈ చిత్రానికి అధ్బుతమైన గ్రాఫిక్స్ అందించాడు. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా గ్రాఫిక్స్ లా అనిపించలేదు. రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది. ఎలుక పాత్రలో బ్రహ్మానందం నటించాడని తెలియగానే సినిమా హిట్ అని చెప్పాను. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచి పేరు తీసుకురావాలి. మంచి సినిమాలు వచ్చే రోజులు త్వరలోనే వస్తాయి" అని చెప్పారు.

Advertisement
CJ Advs

దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ "నేను సినిమాను తెరకెక్కించి సుమారు ఏడు సంవత్సరాలయింది. ప్రస్తుతం తెలుగు చాల చిత్ర పరిశ్రమలో కథలు, టెక్నాలజీ మారిపోయే కెరటం వచ్చింది. అందులో నేను సినిమాలు చేయలేకపోయాను. మా గురువు గారు పిలిచి 'ఎర్రబస్సు' సినిమాకు నువ్వు పని చేయాలని చెప్పారు. ఈ కొత్త ప్రవాహంలో కూడా నాతో అక్షరాలు దిద్ధించారాయన. వేస్టేజ్ తప్పించి ఈ కొత్త ప్రవాహంలో ఏమి రాలేదని తెలుసుకున్నాను. ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నప్పుడు సునీల్ కుమార్ గారిని సలహా అడిగాను. దాసరి గారు ఉన్నారు మీరు సినిమా చేయండని చెప్పారు. మురళి మోహన్ రావు గారు రాసిన 'ఎలుక వచ్చే ఇల్లు భద్రం' అనే నవల ఆదారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కోడిరామకృష్ణ గారు ఇచ్చిన రెండు, మూడు సలహాలు సినిమాకు ఆయువు పట్టనే చెప్పాలి. సినిమాలో గ్రాఫిక్స్ అధ్బుతంగా వచ్చాయి. ఆరు కోట్ల బడ్జెట్ అవుతుందనుకున్న ఈ చిత్రాన్ని మూడు కోట్లలోనే కంప్లీట్ చేసాం. వారం రోజుల్లో చేయాల్సిన పనిని బ్రహ్మానడం గారు రెండు రోజుల్లోనే ముగించారు. సినిమా మంచి సక్సెస్ ను సాధించాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ "రేలంగి నరసింహారావు గారిపై ఉన్న కృతజ్ఞతతో ఈ సినిమా చేసాను. ఓ దశకంలో కామెడీ సినిమాలను డైరెక్ట్ చేసి కమెడియన్స్ కు లైఫ్ ఇచ్చిన వ్యక్తులు రేలంగి నరసింహారావు గారు, జంధ్యాల గారు. నేను కెరీర్ మొదలు పెట్టిన 31 సంవత్సరాలలో 1046 సినిమాలు చేసాను. ఇంకా నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

నిర్మాత నరసింహారావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ "ఎప్పటి నుండో సినిమా చేయాలనుకున్నాం. రేలంగి నరసింహారావు గారే సరైన దర్శకుడని ఆయనతో సినిమా చేసాం. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అని చెప్పారు.

హీరోయిన్ పావని మాట్లాడుతూ "ఈ సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

ఈ చిత్రానికి మూలకథ: మురళీ మోహనరావు, స్క్రీన్ ప్లే: దివాకర్ బాబు, మాటలు: గంగోత్రి విశ్వనాథ్, కెమెరా: నాగేంద్ర కుమార్, ఎడిటర్: నందమూరి హరి, మ్యూజిక్: బల్లేపల్లి మోహన్, గ్రాఫిక్స్: సగిలి సత్యనారాయణరెడ్డి.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs