ఆమధ్య టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయిన త్రిషకి కొంతకాలం సినిమాలు బాగా తగ్గాయి. అయితే ఈమధ్య మళ్ళీ పికప్ అయిందనే చెప్పాలి. తెలుగులో లయన్, ఈమధ్య విడుదలైన ఎంతవాడుగానీ చిత్రాల్లో మంచి క్యారెక్టర్స్ చేసి ఆడియన్స్ చేత ఓకే అనిపించుకున్న త్రిష ఇప్పుడు తమిళ్‌లో నాలుగు సినిమాలు చేస్తోంది. అందులో ఓ సినిమా కమల్‌హాసన్‌తో తెలుగులో ‘చీకటి రాజ్యం’ పేరుతో రూపొందుతోంది. ఆ సినిమాలు అలా వుండగా లవ్‌యు బంగారమ్ చిత్ర దర్శకుడు గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి నిర్మిస్తున్న ‘నాయకి’ చిత్రం షూటింగ్ మరో పక్క జరుగుతోంది. ఈ సినిమాలో త్రిష రెండు షేడ్స్ వున్న క్యారెక్టర్ చేస్తోంది. ఒక క్యారెక్టర్ కోసం బరువు పెరగమని, దానికి సంబంధించిన షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తగ్గమని డైరెక్టర్ గోవి ఆమెతో పరుగులు పెట్టిస్తున్నాడట. బరువు పెరగడానికి, తగ్గడానికి త్రిష తెగ కష్టపడుతోందట. సినిమా మీద, ఆ కథ మీద ఆమెకు వున్న కాన్ఫిడెన్స్ వల్ల డైరెక్టర్ ఎలా చెబితే అలా చేస్తోందట. ఓ పక్క సైజ్ జీరో కోసం అనుష్క తన వెయిట్‌తో ఆటలాడుకుంటూ వుంటే, మరో పక్క త్రిష రెండు విధాలుగా కష్టపడుతోంది. ‘నాయకి’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న త్రిషకి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.