Advertisement
Google Ads BL

తమ్ముడ్ని హీరో చేస్తున్న లారెన్స్‌?


గ్రూప్‌లో ఒక డాన్సర్‌గా, ఆ తర్వాత అసిస్టెంట్‌ డాన్స్‌మాస్టర్‌గా, ఆ తర్వాత డాన్స్‌మాస్టర్‌గా ఒక్కో స్టెప్‌ ఎదుగుతూ వచ్చిన రాఘ వలారెన్స్‌ సౌత్‌ ఇండియాలో టాప్‌ కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నాడు, అందరు హీరోలూ లారెన్స్‌ కొరియోగ్రఫీలో డాన్స్‌ చెయ్యాలని ఉబలాటపడేలా చేశాడు. అంతటితో ఆగకుండా డైరెక్టర్‌గా అవతారమెత్తి ‘మాస్‌’తో డైరెక్టర్‌గా కూడా తన సత్తా ఏమిటో చూపించాడు. ఆ తర్వాత ముని, ముని2, ముని3.. ఇలా వరసగా మూడు సినిమాలను డైరెక్ట్‌ చేసి మూడు సినిమాలూ సూపర్‌ డూపర్‌ హిట్‌ చేశాడు. గ్రూప్‌ డాన్సర్‌ నుంచి టాప్‌ డైరెక్టర్‌ వరకు లారెన్స్‌ కెరీర్‌ గ్రాఫ్‌ని చిన్నప్పటి నుంచి గమనిస్తూ వస్తున్న అతని సోదరుడు ఎల్విన్‌ ఇప్పుడు హీరోగా ఇంట్రడ్యూస్‌ అవ్వబోతున్నాడు. ‘గంగ’ చిత్రంలోని ఐటమ్‌ సాంగ్‌లో డాన్సర్‌గా కనిపించిన ఎల్విన్‌ ఇప్పుడు హీరోగా తెరంగేట్రం చెయ్యడానికి రెడీ అయిపోయాడు. ఆల్రెడీ సిక్స్‌ ప్యాక్‌ చేసిన ఎల్విన్‌ ఈ సంవత్సరంలోనే ప్రారంభమయ్యే ఓ చిత్రం ద్వారా హీరోగా తన లక్‌ని పరీక్షించుకోబోతున్నాడు. వెంధార్‌ మూవీస్‌ పతాకంపై నిర్మాణం జరుపుకునే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరన్నది ఇంకా డిసైడ్‌ అవ్వలేదు. అయితే తన తమ్ముడ్ని హీరోగా ఒక రేంజ్‌కి తీసుకెళ్ళే బాధ్యతను అన్నయ్య లారెన్స్‌కే అప్పగించాలని ఆ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. ఈ విషయంలో  లారెన్స్‌ ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ అతనే డైరెక్షన్‌ చేసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs