`బాహుబలి` రాజమౌళిని ఎక్కడికో తీసుకెళ్లింది. ట్రైలర్ చూసినప్పట్నుంచి ఆయన గురించి హాలీవుడ్ కూడా ఆరా తీస్తోంది. బాలీవుడ్ నుంచి అయితే ప్రశంసల వెల్లువ కురుస్తోంది. చాలా రోజలు తర్వాత ఓ తెలుగు దర్శకుడు ప్రపంచవ్యాప్తంగా వెలిగిపోతున్నాడనీ, మనమంతా గర్వపడేలా చేశాడని తెలుగువాళ్లు ఎంతో సంతోషపడుతున్నారు. `బాహుబలి`లాంటి ఎపిక్‌ని తీసినందుకు అందరూ ఆయన్ని పొగిడేవాళ్లే. కానీ ఓ తెలుగు నటుడు మాత్రం విమర్శించాడు. రాజమౌళినీ, ఆయన తీసిన బాహుబలిని సపోర్ట్ చేసే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చాడు. ఆ వైనం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా? సురేష్. పలు చిత్రాల్లో కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన సీనియర్ నటుడు సురేష్‌కి రాజమౌళి ఓ విషయంలో నచ్చలేదు. తెలుగులో మహామహుల్లాంటి నటులున్నా వాళ్లకు ఎందుకు అవకాశమివ్వలేదనీ, బాహుబలిలోని పాత్రలకు జగపతిబాబు, సాయికుమార్, సుమన్‌లాంటి నటులు బాగా సరిపోతారనీ, వాళ్లని కాకుండా వేరొకరిని తీసుకొన్నారని ట్వీట్ చేశాడు. అందుకే నేను బాహుబలిని,రాజమౌళినీ సపోర్ట్ చేయలేదని చెప్పుకొచ్చాడు.
Advertisement
CJ Advs