నితిన్ దగ్గర డబ్బుల్లేవట..!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నితిన్ చేయాల్సిన సినిమా క్యాన్సిల్ కావడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఆ సినిమా నిర్మాణంలో ఛార్మి జోక్యం చేసుకొంటుందని పూరి చెప్పడంతోనే నితిన్ సినిమాని క్యాన్సిల్ చేసుకొన్నాడని ప్రచారం సాగుతోంది. రెండు మూడు రోజులుగా ఛార్మి వల్లే... ఛార్మి వల్లే... అంటూ ఫిల్మ్‌నగర్ జనాలు మాట్లాడుకొంటున్నారు. ఆ విషయం ఛార్మి దృష్టికి కూడా వచ్చింది. వెంటనే తనదైన శైలిలో స్పందించింది. ``సినిమా ఇండస్ట్రీ పురుషాధిక్యంతో కూడుకొన్నది. అందుకే అమ్మాయినైన నా గురించి అలా రకరకాలుగా మాట్లాడుకొంటున్నారు`` అని ఛార్మి క్లారిఫై ఇచ్చింది. ఆమె తన సన్నిహితులతో మాట్లాడుతూ ``నాకూ పూరి-నితిన్‌ల సినిమాకీ మధ్య సంబంధమేమిటో అర్థం కావడం లేదు. నితిన్ దగ్గర డబ్బుల్లేకపోవడంతోనే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది తప్ప నేను కాదు``ని చెబుతోందట. మరి దీనిపై నితిన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads