రానాలో అంత మంచి రైటరున్నాడా?
Advertisement
CJ Advs
అజానుబాహుడిలాంటి రానాలో మంచి కథానాయకుడు ఉన్నాడు. `లీడర్` మొదలుకొని పలు చిత్రాలతో ఆ విషయం రుజువైంది. మంచి ప్రతినాయకుడు కూడా ఉన్నాడని `బాహుబలి`తో నిరూపించబోతున్నాడు. కానీ ఆయనలో మనకెవ్వరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. రానాలో మంచి రైటర్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా బయటపెట్టారు. `బాహుబలి` షూటింగ్ పూర్తయ్యాక టీమ్ అందరికీ రానా ఓ ఉత్తరం రాశాడట. ఆ ఉత్తరంలో బాహుబలి టీమ్‌తో తనకున్న అనుబంధానికి అక్షరరూపం ఇచ్చాడట. ఆ ఉత్తరం చూసి బాహుబలి టీమ్ అంతా కన్నీళ్లు పెట్టుకొంటూ ఉద్వేగానికి లోనయ్యారట. అందుకే.. 'బాహుబలి 2`కి స్ర్కిప్టు రాయమని రానాని కోరినట్టు రాజమౌళి `బాహుబలి` ఆడియో వేడుకలో చెప్పుకొచ్చాడు. నీలో మంచి రైటరున్నాడు అని రాజమౌళి చెప్పగానే రానా ఆడియో వేడుకలో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. రాజమౌళిలాంటి దిగ్దర్శకుడి నుంచి ఆ ప్రశంస రావడం రానాని అంతగా ఆనందపెట్టిందన్నమాట.
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads