Advertisement
Google Ads BL

'కేరింత' సినిమా విజయోత్సవ వేడుక ..!


సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా 'కేరింత'. జూన్ 12న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ "సినిమా రిలీజ్ అవ్వగానే మోడతో షో కు యాబై శాతం మాత్రమే ఓపెనింగ్స్ వచ్చాయి. ఓ గంట సమయం పాటు చాలా బాధపడ్డాను. ఓపెనింగ్స్ అలా రావడానికి నిన్న మా సినిమాతో పాటు రెండు సినిమాలు రిలీజ్ కావడం ఇలా చాలా కారణాలు ఉన్నాయి. కాని ప్రస్తుతం చిన్న సినిమాలకు సినిమా బావుందని తెలిస్తేనే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదు. చిన్న సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయాలి. మా చిత్రం మొదటి షో చూసిన తరువాత పాజిటివ్ టాక్ రావడంతో వైజాగ్, శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాలల్లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. థియేటర్లలో నూకరాజు, భావన పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తోంది" అని చెప్పారు.

Advertisement
CJ Advs

దర్శకుడు సాయికిరణ్ అడవి మాట్లాడుతూ "దిల్ రాజు గారు ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచిస్తారు. ఆ పాజిటివ్ ఆలోచనలు 'జై' పాత్రలో ఉండేలా చూసుకున్నాను. ఈ సినిమాలో ప్రతి పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. అందరు చక్కగా నటించారు. టెక్నీషియన్స్ అందరూ ఎంతగానో సపోర్ట్ చేసారు. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ "సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది ఫోన్స్ చేసి బాగా నటించావు అని చెప్తుంటే సంతోషంగా అనిపించింది. ఈ సినిమాలో నా పాత్రకు ఇంపార్టన్స్ ఉంటుంది. ఇదొక చాలెంజింగ్ రోల్. ఇంత మంచి పాత్రలో నటించే అవకాశం మరలా వస్తుందో లేదో కూడా చెప్పలేను" అని చెప్పారు.

శ్రీదివ్య మాట్లాడుతూ "ఈ సినిమాలో మెడికల్ స్టూడెంట్ పాత్రలో నటించాను. నా రోల్ చాలా బబ్లీ గా ఉంటుంది. చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్. ఎమోషన్స్ సీన్స్ లో నటించాను. ప్రేమ, జీవితం వేరు కాదని సినిమాలో 'జై' చెప్పే పాయింట్ నాకు బాగా నచ్చింది. దిల్ రాజు గారి బ్యానర్ లో చేయడం ఆనదంగా ఉంది. ప్రస్తుతం 'బెంగుళూరు డేస్' , 'కాష్మోరా' చిత్రాలో నటిస్తున్నాను" అని చెప్పారు.

విశ్వ మాట్లాడుతూ "ఈ సినిమాలో ఓ ఎమోషనల్ పాత్రలో నటించాను. అందరం చాలా కష్టపడి చేసిన సినిమా ఇది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజు గారికి, డైరెక్టర్ గారికి థాంక్స్" అని చెప్పారు.

తేజస్వి మాట్లాడుతూ "ఇప్పటి వరకు హైపర్ రోల్స్ లోనే నటించాను. తొలిసారి ఎమోషన్స్ ఉన్న పాత్రలో నటించాను. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అని చెప్పారు.

పార్వతీశం మాట్లాడుతూ "ఈ సినిమా చేయకముందు చాలా నాటకాలు వేసాను. నాకు ఈ అవకాశం రావడం అద్రుష్టంగా భావిస్తున్నాను. శ్రీకాకుళం యాస లో మాట్లాడాలనగానే రెండురోజులు ప్రాక్టీస్ చేసాను. సినిమాలో నా పాత్రకు మంచి అప్లాజ్ వస్తోంది" అని చెప్పారు.

సుకృతి మాట్లాడుతూ "షూటింగ్ ఎక్స్ పీరియన్స్ బావుంది. ఆడిషన్స్ లో నన్ను సెలెక్ట్ చేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు" అని చెప్పారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs