Advertisement
Google Ads BL

'జ్యోతిలక్ష్మి' సినిమా సక్సెస్ మీట్..!


ఛార్మి ప్రధానపాత్రలో ఛార్మి కౌర్‌ సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్మెంట్‌ ప్రై.లి., శ్రీశుభశ్వేత ఫిలిమ్స్‌ బ్యానర్స్‌పై డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో శ్వేతలానా, వరుణ్‌, తేజ్‌, సి.వి.రావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘జ్యోతిలక్ష్మీ’. జూన్ 12న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సమవేశంలో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ "మొదటిసారిగా చిత్ర పరిశ్రమలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా  450 థియేటర్లలో రిలీజ్ అయిన ఘనత 'జ్యోతిలక్ష్మి'కే దక్కింది. సినిమా రిలీజ్ కు ముందుగానే మా చిత్రబృందం 'జ్యోతిలక్ష్మి' ఆలోజింపజేసే చిత్రమవుతుందని తెలిపాం. ఈరోజు సినిమాను ఆదరించి ప్రేక్షకులు ఆ విషయాన్ని నిరూపించారు. ఈ క్రెడిట్ అంతా పూరి గారికే చెందుతుంది. ఒక సక్సెస్ సినిమాను ప్రేక్షకులు చూడకుండా ఎవరు ఆపలేరు. అదే ఓ ఫెయిల్యూర్ సినిమాను ఎంతగా ప్రమోట్ చేసిన ఎవరు చూడరు. ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు చూడాలో బాగా తెలుసు. ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉండాలని నాంది పలికిన సినిమా 'జ్యోతిలక్ష్మి'. ఈ చిత్రాన్ని ఎవరు పాడుచేయాలని చూడకండి. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమిది. మగవాళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలో తెలిపిన సినిమా ఇది. చార్మి ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వడం చూస్తుంటే తనలో ఉన్న తపన తెలుస్తోంది. భవిష్యత్తులో ఖచ్చితంగా పెద్ద ప్రొడ్యూసర్ గా ఎదుగుతుంది. ప్రస్తుతం మేము నిర్మిస్తున్న వరుణ్ తేజ్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 'జ్యోతిలక్ష్మి' చిత్రబృందం ఆ సినిమాలో కూడా ఇన్వాల్వ్ అవ్వనున్నారు" అని తెలిపారు.

Advertisement
CJ Advs

దర్శకుడు పూరిజగన్నాథ్ మాట్లాడుతూ "జూన్ 12న రిలీజ్ అయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో క్లైమాక్స్ డైలాగ్స్ కు వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రాంగోపాల్ వర్మ గారు నీ కెరీర్ బెస్ట్ సినిమా ఇదే అని చెప్పగానే చాలా సంతోషపడ్డాను. సత్యమూర్తిగారు నా జీవితంలో బెస్ట్ పెన్ ఈ సినిమానే అని చెప్పారు. ఆడవాళ్ళూ చూడాల్సిన సినిమా ఈ 'జ్యోతిలక్ష్మి'. మగవాళ్ళు ఆడవాళ్లకే రెస్పెచ్త్ ఇవ్వడం కాదు, ఓ స్త్రీ మరో స్త్రీ కి కూడా మర్యాద ఇవ్వాలి" అని చెప్పారు.

చార్మి మాట్లాడుతూ "బయట ఇప్పుడు అందరు నన్ను జ్యోతిలక్ష్మి అని పిలుస్తున్నారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు" అని తెలిపారు.

హీరో సత్య మాట్లాడుతూ "పూరి గారి సినిమా అనగానే చిన్న పాత్రయినా అవకాశం వస్తే చాలనుకున్నాను. కాని నాకు ఈ సినిమాలో హీరోగా నటించే చాన్స్ ఇచ్చారు. ప్రతి ఇంట్లో ఆమ్మ, చెల్లెలు, భార్య రూపంలో ఓ లక్ష్మి ఉంటుంది. ఈ సినిమా చూస్తే వారిపై గౌరవం మరింత పెరుగుతుంది" అని చెప్పారు.

మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ మాట్లాడుతూ "ఈ సినిమాలో భాగం అయినందుకు చాలా గర్వంగా ఉంది. థియేటర్లలో ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. 'జ్యోతిలక్ష్మి' చూసిన తరువాత దేవిశ్రీప్రసాద్ గారు కాల్ చేసి పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బావుందని చెప్పారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పూరి గారికి, చార్మి గారికి నా ధన్యవాదాలు" అని చెప్పారు.

ఇంకా ఈ కార్యక్రమంలో విందా, అజయ్ ఘోష్, భద్రం తదితరులు పాల్గొన్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs