`చుట్టాలబ్బాయ్`గా ఆది!
యువ కథానాయకుడు ఆది `చుట్టాలబ్బాయ్`గా సందడి చేయబోతున్నాడు. అహనాపెళ్లంట, పూల రంగడులాంటి వినోదాత్మక చిత్రాల్ని తెరకెక్కించిన వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ఆది నటించబోతున్నాడు. ఆ చిత్రానికే `చుట్టాలబ్బాయ్` అనే పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. గురువారమే సినిమాకి క్లాప్ కొడుతున్నాడు. ఆది సరసన ఓ కొత్త కథానాయిక ఆడిపాడుతుందని సమాచారం. తొలి రెండు చిత్రాలతో విజయాలు సొంతం చేసుకొన్న వీరభద్రమ్ చౌదరి నాగార్జునతో తీసిన `భాయ్`తో పరాజయాన్ని చవిచూశారు. దీంతో ఆయన జోరుకు బ్రేక్ పడినట్టయ్యింది. కాస్త విరామం తీసుకొని మళ్లీ కొత్త సినిమాకి సిద్ధమయ్యారు. ఆదితో తీయబోయే `చుట్టాలబ్బాయ్`తో విజయం గ్యారెంటీ అని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తారు.
Advertisement
CJ Advs
Show comments
Advertisement
Google Ad amp 3
CJ Ads
Advertisement
Google Ad amp 3
CJ Ads