Advertisement
CJ Advs
`కొత్తజంట` తర్వాత అల్లు శిరీష్ మరో సినిమా చేయలేదు. ఈసారి మరింత మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని స్క్రిప్టుల్ని పరిశీలిస్తూ వచ్చాడు. కొంతకాలం క్రితమే పరశురామ్ చెప్పిన కథకి ఓకే చెప్పి, ఆయన దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. గీతా ఆర్ట్స్ సంస్థలోనే రూపొందనున్న ఈ సినిమాని 12వ తేదీన లాంఛనంగా ప్రారంభిస్తున్నట్టు సమాచారం. `ఆంజనేయులు`, `సోలో`, `సారొస్తారు` తదితర చిత్రాల్ని తీసిన దర్శకుడు పరశురామ్. ఈసారి అల్లు శిరీష్ కోసం ఓ క్యూట్ లవ్ స్టోరీని సిద్ధం చేశాడట. అందులోనే అల్లు శిరీష్ సిక్స్‌ప్యాక్‌తో కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి `మేరీ జాన్` అనే పేరును కూడా ఫిక్స్ చేసినట్టు ఫిల్మ్‌నగర్ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. మరి అందులో నిజమెంతన్నది తేలాలి. కథానాయిక గురించి ప్రస్తుతం ఫొటోషూట్‌లు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక విశేషాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.